Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ఫార్మసీలో ప్రక్షాళన

medical

రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల సర్టిఫికెట్లకు ఆధార్ లింక్
అద్దెకు ధృవీకరణ పత్రాలు ఇచ్చే సంస్కృతికి చెక్
ఫార్మసీలో పలు డిప్లమా కోర్సులు

వనపర్తి : రిటైల్ మందుల దుకాణాల్లో రిజిస్టర్ ఫార్మ సిస్టు పని చేస్తున్నట్లు ధృవీకరణ పత్రాలు కనిపిస్తాయి. కాని దుకాణంలో ఫార్మ సిస్టు ఎక్కడ కనిపించడు. ఫార్మసి విద్యార్హత ధృవీకరణ పత్రాలను మందుల షాపు యజమానికి అద్దెకు ఇచ్చి తానుదర్జాగా వేరే చోట ఉద్యోగం చేస్తుంటాడు. ఈ విషయం అందరికి తెలిసిన నగ్నసత్యం. ఇది ఒక రకంగా ప్రభుత్వాన్ని ప్రజ లను మోసం చేయడమే. బహుశఇకపై ఇలాంటి జిమిక్కులు కుదరకపోవ చ్చు. ఫార్మసిస్టుల సర్టిఫికెట్స్ అద్దె నాటకానికి తెరదించేచర్యలు చేపడుతున్నట్లు జాతీయ ఔషద మండలి ప్రతి ఫార్మసిస్టుకు ఆధార్‌నెంబర్ జత చేసే కార్యక్రమా నికి శ్రీకారంచుట్టామని ఆయన చెప్పారు. దీనివల్ల సమీపభవిష్యత్తులో ఫార్మసిస్టు ఎక్కడ పని చేస్తున్నాడోతెలిసిపోతుందని, ఫలితంగా రిటైల్ ఫార్మసి దుకాణంలో సర్టిఫికెట్స్ ఇచ్చే చెడు సంస్కృతికిచెక్ పెట్టవచ్చని ప్రభుత్వంఫార్మసి విద్యాభివృ ద్ధికి కౌన్సిల్ చర్యలను చేపడుతున్నారు.
స్కిల్స్ పెంచే డిప్లమో కోర్సులు..
దేశవ్యాప్తంగా బి.ఫార్మసి, ఎం ఫార్మసి, ఫార్మాడి. వంటి కోర్సులకు ఒకే సెలబస్ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కళాశాల నుండి బయటకు వచ్చే ఫార్మసి విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఔషధ పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా వారిని మలించేందుకు పలు డిప్లమో కోర్సులను ప్రవేశపెట్టేందుకు పిసిఐ సెంట్ర ల్ కమిటీ యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఫార్మసి విద్యను అభ్యసిస్తునే విద్యా ర్థులు , ఔషధ రంగంలో నాణ్యత ప్రమాణాలు ,మార్కెటింగ్ సెక్టార్ విభాగంలో నైపుణ్యం ,ఔషదాల తయారీ, వాడకంలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవ డానికి పలు డిప్లమో కోర్సులు ప్రవేశపెట్టేందుకు పిసిఐ సెంట్రల్ కమిటి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంటుంది. కర్నాటక రాష్ట్రంలో డిమ్డ్ యూనివర్సిటిల్లో పలు డిప్లమో కోర్సులు అందుబాట్లో ఉన్నాయని , ఇదే రీతిలో మన రాష్ట్రంలోను వీటి ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సిక్స్ సిగ్మా, ఎంబిఎ, ఎల్‌ఎల్ బి, క్వాలిటి కంట్రోల్, డ్రగ్‌స్టోరేజ్, క్యూబిడి, క్వాలిటి ఎస్యురెన్స్, పేటెంట్ ఇన్‌లా లీగల్ మేనేజ్‌మెంట్, ఫార్మకో విజిలెన్స్, రెగ్యులేటరి అఫైర్స్ తదితర కోర్సుల్లో తర్పీదు పొందితే ఫార్మసి విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఫార్మసిస్టులు ఇంజెక్షన్లు చేసేందుకు సిద్ధ్దం..
వైద్య రంగంలో ఇప్పటివరకు డాక్టర్లు, నర్సులు మాత్రమే రోగులకు సూది మం దు వేస్తున్నారు.అంతా అనుకూలిస్తే ఇకపై ఫార్మసిస్టులు కూడాసిరంజులు చేతప డతారు .గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు ఇంజెక్షన్లు చేసేందుకు ఫార్మా డి విద్యా ర్థులకు అనుమతించాలని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్న ట్లు తెలిసింది.ఆరేళ్లపాటు ఫార్మా డి కోర్సుల్లో మందుల దుష్ప్రభావాలను విద్యా ర్థులు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. మూడేళ్ల నర్సింగ్ కోర్సు చేసిన వారే ఇంజె క్షన్లు చేస్తున్న నేపథ్యంలో ఫార్మా.డి విద్యార్థులకు ఇంజెక్షన్లు చేసే అవకాశం కల్పించాలని జాతీయఫార్మసి కౌన్సిల్ తరపున త్వరలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపారు.వెయ్యి పడకలు ఉన్న ప్రభుత్వ వైద్య బోధన ఆసు పత్రిలో ఒక ఫార్మసి కాలేజికి చెందిన ఫార్మా.డి విద్యార్థులకు మాత్రమే క్లినికల్ అటాచ్‌మెంట్‌కు పిసిఐ అనుమతిస్తోందని ,మూడు ఫార్మసి కళాశాలలను అను మతించే విషయం కౌన్సిల్ పరిశీలనలోఉందన్నారు.

Comments

comments