Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పైనల్లో నాదల్, హలెప్

Many of the top players in the process of joining the final are Stephens

టైటిల్ పోరుకు స్టీఫెన్స్, స్టెఫానెస్                                                                                                                                రోజర్స్ కప్ టెన్నిస్

మాంట్రియల్: ప్రతిష్టాత్మకమైన రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్‌లు రఫెల్ నాదల్ (స్పెయిన్), సిమోనా హలెప్ (రుమేనియా) ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ బుల్ నాదల్ రష్యా ఆటగాడు కరెన్ కచనోవ్‌ను ఓడించాడు. మహిళల విభాగంలో హలెప్ ఆస్ట్రేలియా స్టార్ ఆశ్లే బార్టీను ఓడించింది. ఫైనల్లో నాదల్ గ్రీస్ సంచలనం స్టెఫానెస్ టిసిపాస్‌తో తలపడుతాడు. హలెప్ అమెరికా అగ్రశ్రేణి క్రీడాకారిణి మూడో సీడ్ స్లొవానె స్టీఫెన్స్‌ను ఢీకొంటోంది.

దూకుడుగా…

కచనోవ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో అగ్రశ్రేణి ఆటగాడు నాదల్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. రష్యా ఆటగాడు కరెన్ కూడా నాదల్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఇద్దరు దీటుగా ఆడడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. చివరి వరకు ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న నాదల్ 76, 64తో కచనోవ్‌ను ఓడించాడు. ప్రారంభ సెట్‌లో నాదల్‌కు ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఇద్దరు పోటీ పడి ఆడడంతో ఆధిపత్యం తరచూ చేతులు మారింది. ఎవరి సర్వీసులను వారు నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు. దీంతో సమరం హోరాహోరీగా సాగింది. కచనోవ్ అసాధారణ పోరాట పటిమను కనబరుస్తూ నాదల్‌కు గట్టి పోటీనే ఇచ్చాడు. కచనోవ్ పట్టు వీడకుండా పోరాడడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఈ దశలో నాదల్ పైచేయి సాధించాడు. ప్రత్యర్థి బలహీనతలను తనకు అనుకూలంగా మార్చుకున్న నాదల్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, రెండో సెట్ ప్రారంభంలో కూడా పోరు నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. ఇద్దరు పోటీ ఆడుతూ లక్షం దిశగా సాగారు. కానీ, తొలి సెట్‌తో పోల్చితే ఈసారి నాదల్ కాస్త దూకుడును పెంచాడు. ఈ క్రమంలో ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేయడంలో సఫలమయ్యాడు. ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైన కచనోవ్ వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన నాదల్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు.

స్టెఫానెస్ సంచలనం..
మరో సెమీఫైనల్లో గ్రీస్ యువ సంచలనం స్టెఫానెస్ టిసిపాస్ విజయం సాధించాడు. రోజర్స్ కప్‌లో సంచలన విజయాలు సాధిస్తూ ఏకంగా ఫైనల్‌కు చేరాడు. ఫైనల్‌కు చేరే క్రమంలో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లను స్టెఫానెస్ మట్టికరిపించాడు. జొకొవిచ్, జ్వరెవ్ తదితరులను స్టెఫానెస్ కంగుతినిపించాడు. తాజాగా సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు, నాలుగో సీడ్ కెవిన్ పీటర్సన్‌ను కూడా సెమీఫైనల్లో ఓడించాడు. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో అన్‌సీడెడ్ స్టెఫానెస్ 67, 64, 76 తేడాతో అండర్సన్‌పై విజయం సాధించాడు. చివరి వరకు పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగింది. తొలి సెట్‌లో అండర్సన్ విజయం సాధించాడు. టైబ్రేకర్ వరకు వెళ్లిన పోరులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న అండర్సన్ సెట్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు స్టెఫానెస్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా ఓటమి తప్పలేదు. అయితే రెండో సెట్‌లో గ్రీస్ ఆటగాడికి ఎదురు లేకుండా పోయింది. చూడచక్కని షాట్లతో అలరించిన స్టెఫానెస్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దూకుడుగా ఆడిన స్టెఫానెస్ అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇటు అండర్సన్, అటు స్టెఫానెస్ విజయం కోసం సర్వం ఒడ్డారు. దీంతో ఈ సెట్ కూడా టైబ్రేకర్ వరకు వెళ్లింది. దీనిలో పైచేయి సాధించిన స్టెఫానెస్ ఫైనల్‌కు చేరుకున్నాడు. టైటిల్ పోరులో టాప్ సీడ్ నాదల్‌తో స్టెఫానెస్ తలపడుతాడు.

Comments

comments