Home తాజా వార్తలు కళాత్మక నేతల కల్పవల్లి

కళాత్మక నేతల కల్పవల్లి

 

Many people have migrated to other jobs for employment

నేతలరాతలు మార్చిన పోచంపల్లి

తెలంగాణలో చేనేతకు మహర్దశ
పోచంపల్లిలో అలుపెరుగని కదురు
ప్రభుత్వం చేయూతతో ఇక్కాత్‌ల విలాసం
దేశదేశాల నుంచి ఆర్డర్లు

‘మనతెలంగాణ’ గ్రెౌండ్ రిపోర్ట్: తెలంగాణ చేనేతకు పెట్టిందిపేరు. రైతన్న తరువాతి స్థానం నేతన్నదే. అయితే చేనేత గిట్టుబాటు కాకపోవడంతో చాలామంది ఉపాధికోసం ఇతర పనులు చూసుకుని వలస బాటపట్టారు. ఒకప్పుడు ఆకలితో ఆత్మహత్యలు…వలసలతో కుదేలైన చేనేత పరిశ్రమ ఆ సంక్షోభం నుండి ఇప్పుడు బయట పడింది. చేతి వృత్తిని వదిలి వలసపోయిన వారు తిరిగివస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న చేయూత వల్ల నేతన్నల్లో నిరాశానిస్పహలు తగ్గాయి, భవిష్యత్ పట్ల ఆశతో ఇపుడు మగ్గాలు తిప్పుతున్నారు.

పోచం పట్నం: హైదరాబాద్‌కు దాదాపు 60 కి.మీ దూరంలో యాదాద్రిభువనగిరిజిల్లాలోదే పోచంపల్లి గ్రామం. మనందరం కట్టుకునే దుస్తులు ఎంత కష్టపడి పోగు పోగు పేర్చి నేస్తేనే ఇంత అందంగా తయారయ్యాయో తెలుసుకోవాలంటే ఈ చేనేత గ్రామాన్ని చూసి తీరాలి. అంతేకాదు భూదాన్ ఉద్యమం వల్ల ఆ గ్రామానికి ‘భూదాన్ పోచంపల్లి’గా చరిత్రలో నమోదయింది. ఇక్కడి నేతన్నల చేనేత దేశంలోనే మొదట గా పేటెంట్ హక్కు పొందడం ఓ ప్రత్యేకత. అనాడు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసిన నేతన్నలు ప్రస్తు తం అనేక డిజైన్‌లలో చేనేత బట్టలను నేసి, అందరినీ ఆకట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల వారే కాకుండా, విదేశీయులు కూడా ప్రతి రోజూ ఇక్కడికి వస్తున్నారు. నాణ్యమైన చేనేత దుస్తుల కోసం పోచం పల్లిని వెతుక్కుంటూ పట్నమే వస్తోంది. దీనిపై ‘మన ప్రతి గ్రెౌండ్ రిపోర్ట్
పోచం పల్లి గ్రామ జనాభా 18000. వీరిలో 65శాతం మంది చేనేత కార్మికులు. ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేది మగ్గాలే. అవే ఇంటికి సంపద. వాటి చుట్టూ అల్లుకొని వుంటాయి ఆ కుటుంబీకుల జీవితాలు.ప్రతీ నెల ఒక చేనేత కుటుంబ ఆదాయం రూ.12000 నుండి 14,000. సంపాదిస్తుంది. గ్రామం నుండి నెలకు సుమారు వేల వస్త్రాలు తయారై దేశవిదేశాలకు చేరుతుంటాయి.

పోచంపల్లి ప్రత్యేకత ఏంటీ?
పూర్తి నూలు, లేదా పట్టు కలయికలతో పోచంపల్లి డిజైన్ మెటీరియల్, చీరలు నేస్తారు. తొలి పేటెంట్ హక్కులు పొందిన ప్రత్యేకత కూడా దీనికి ఉంది. ఆ నేతలో వైవిధ్యమైన డిజైన్లు రూపొందిస్తారు. ఆ రంగుల దారాల్లో నెమళ్లు నాట్యం,చిలుకలు పలకరింపు, పూలను అల్లుకున్న లతలు ఇలా రకరకాల ఆకతులు తయారు చేస్తారు. భారీ జరీలు నిండిన చీరలకు విరుద్ధంగా ఈ డిజైన్లలో రంగుల రమణీయతకు ప్రాధాన్యత ఉంటుంది. బట్టలు నేసిన తరువాత రంగులద్దడం చాలా సులువు. కానీ పోచంపల్లి నేత ప్రత్యేకత ఏమిటంటే, నేయడానికి తీసి పెట్టుకున్న దారానికి రంగులద్ది, దానిని తరువాత నేస్తారు. పడు గు, పేక సమంగా కలవకుంటే, ఆ ఆకతి నేతలో రానే రాదు. కాంబినేషన్‌లో సరైన శ్రద్ధ లేకపోతే ఆకతి సరిగా రానే రాదు. పవర్‌లూం వల్ల అసలు రాదు. కేవలం మగ్గాలమీద చేతులతోనే చేసే చాలా కష్టమైన, క్లిష్టమైన నేత ఇది.

చేనేత పార్క్ పర్యాటకంగా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ ప్రత్యేకంగా చేనేత పార్కును ఏర్పాటు చేశారు. చేనేత వస్త్రాల కొనుగోలుకు, పరిశీలనకు వచ్చిన వారికి అన్ని రకాల వసతులు ఈ పార్కులో ఉన్నాయి. చేనేత ఉత్పత్తుల తయారీ విధానం వివరించే ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ పార్కులోనే సమావేశపు హాల్, ఓపెన్ థియేటర్ ఉన్నాయి. పక్కనే చెరువు ఉంది. పర్యాటక శాఖ అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తే మరింత మంది పర్యాటకులు అకట్టుకోవచ్చని స్ధానిక చేనేత సంఘ నాయకులు అంటున్నారు.

తగిన ప్రాధాన్యత ఇవ్వాలి చేనేత వస్త్రానికి ప్రత్యేకత ఉంది. ఇంత విశిష్టత కలిగిన టైఅండ్‌డై చీరలకు పేటెంట్ ఉంది. ఈ మధ్య కాలంలో చేనేత చీరలను అందులోనూ పోచంపల్లి చీరలను ఇష్టపడుతున్నారు. అన్ని రంగాలవారు పోచంపల్లి చీరలను మక్కువ చూపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వినియోగదారులు చేనేత వస్త్రాలను కోనుగోలు చేస్తున్నారు. దాంతో పాటు హైదరాబాద్, విజయవాడ, వరంగల్ నగరాల నుంచి వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో చేనేత వస్త్రాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.’
                                                                                                  భారత లవకుమార్, కార్యదర్శి,పోచంపల్లి చేనేత సంఘం.

మరమగ్గాల నుండి కాపాడండి
‘కాటన్ మిల్లులు, మరమగ్గాల నిర్వాహకుల నుంచి చేనేత పరిశ్రమకు చాలా నష్టం జరుగుతోంది. నేత కార్మికుల రెక్కల కష్టాలపై 11 రకాల డిజైన్ల వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. మిల్లు యాజమానులు, మరమగ్గాల నిర్వాహకులు రాత్రికి రాత్రి యంత్రాలపై వాటిని తయారుచేస్తున్నారు. ఫలితంగా మగ్గంనేసే కార్మికులకు పనిలేకుండా పోతుంది ఇలాంటి మోసాలను ప్రభుత్వం సమర్థంగా అరికడితే చాలు, పోచంపల్లికి బంగారు భవిష్యత్ ఉంటుంది” చేనేత సంఘనాయకులు తడ్క వెంకటేష్ .

గతంలో పోచంపల్లి చీరలు తెప్పించుకోవాలని వినియోగ దారులు చూసేవారు. కాని ప్రస్తుతం ఇక్కడి నేతపనితనం చూసిన వారెవరైనా పోచంపల్లి వెళ్లి చీరలు చూసొద్దామనే బయలుదేరుతున్నారు. దేశ, విదేశాల మహిళలు సైతం హైదరాబాద్‌కు వస్తే పోచంపల్లి ఎక్కడుందని తెలుసుకొని వస్తున్నారు. ప్రభుత్వం దీనిని ఒక టూరిజం సెంటర్‌గా తీర్చిదిద్ది మౌలిక వసతులు కల్పించాలి. అపుడే చేనేతకు మరింత చేయూత కలుగుతుంది.” అన్నారు పోచంపల్లి గ్రామ సర్పంచ్ లతా వెంకటేశం.

నకిలీ ఉత్పత్తులున్నాయి జాగ్రత్త
కొందరు పవర్‌లూవ్‌ు వస్త్రాలకు చేనేత ముద్ర(హ్యాండ్‌లూవ్‌ు మార్క్) వేసేసి వినియోగదారులను మోసం చేస్తున్నారు. చేనేత రంగం ఉసురు తీస్తున్న ఇలాంటి ధోరణులను ప్రభుత్వం నిలువరించకపోవడంవల్ల, రాష్ర్టంలో మగ్గం నేసే కార్మికుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది.
                                                                                                                     చేనేత కార్మిక సంఘనాయకుడు వాస్‌దేవ్,

స్వచ్ఛమైన నేత వస్త్రాలకు ఛలో పోచంపల్లి
ఇంట్లో శుభకార్యాలున్నపుడు పోచంపల్లి గ్రామానికే వెళ్ళి పట్టుచీరలు కొనుక్కురావచ్చు. మనం అక్కడ కొంటే చవకగా కొనుక్కోడమే కాకుండా దళారీలకి చెల్లించేది తగ్గి, నేతన్నల చీరలకు మార్కెటింగ్ ఉంటుంది. చేనేత కార్మికుల చేతుల్లో ఒదిగిన వస్త్రాలను కొనడానికి పోచంపల్లికి వెళ్లగానే మెయిన్ రోడ్డుకు ఇరువైపుల చేనేత వస్త్రాల దుకాణాలున్నాయి. సుమారు 50పైనే పట్టుచీరల దుకాణాలున్నాయి. చేనేత వస్త్రాలను తయారు చేయించేది ఈ దుకాణాల సముదాయాల వారు కావడంతో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో దొరికే ధరల కంటే సరసమైన ధరలకే లభిస్తాయి. దాంతో పాటు చేనేత సోసైటీలోనూ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులోనూ రకరకాల చీరలు, చేనేత వస్త్రాలు లభిస్తాయి. సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయి.

పోచంపల్లి నేతమ్మల స్పందన
‘ఎంతో శ్రమించి చీరలను తయారుచేస్తాం. ఒక చీర నేయడానికి నాలుగు, ఐదు రోజుల సమయం పడుతుంది. చీర నేతకు ప్రత్యేక శ్రద్ధను పెట్టాలి, కాబట్టే చేనేత చీరలకు ఇంత విశిష్టత. ఒక చీర నేతకు ముగ్గురు చేనేత కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. రోజుకు 12గంటల చొప్పున ఏకధాటిగా శ్రమించాలి.’
                                                                                                                                                     సంగం చందన.
వేడిలో చల్ల దనం..
“ వేసవిలో నూలు వస్త్రాలలోని చల్లదనం అందరు కోరుకుంటారు.. అందుకే కాటన్ వస్త్రాలకు డిమాండ్ ఎక్కువ. పోచంపల్లి డిజైన్ పరంగానూ, కాలానుగుణంగా ఆకర్షించే అందమైన ఫ్యాబ్రిక్. పోచంపల్లి మెటీరియల్‌లో లేత నుంచి ముదురు రంగుల వరకు లభిస్తున్నాయి. వేసవికి.. ఆకుపచ్చ, నీలం, నిమ్మపండు రంగు, క్రీవ్‌ు .. ఇలా అన్నింటిలోనూ లేత రంగులను ఎంచుకుంటే మరీ బాగుంటుంది. ’

తెలంగాణలో తయారవుతున్న చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం బీబీ రసూల్, ప్రసాద్ బినప్ప వంటి మోడల్స్‌ను అంబాసిడర్‌లుగా నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మ వేడుకల సమయంలో తెల్ల రేషన్ కార్డున్న మహిళలకు చీరలిస్తోంది. ఆ చీరలు నేసే పనిని కూడా చేనేతకారులకే ఇప్పించాలంటే అసాధ్యం అనిపించింది. రాష్ర్టంలో 17, 573 చేనేత మగ్గాలున్నాయి. వాటిలో చీరలు నేసే మగ్గాలు సగానికి మించవు. అంత పెద్ద ఆర్డర్‌ను పూర్తి చేయడానికి పవర్‌లూవ్‌‌సు మీద పనిచేస్తున్న సిరిసిల్ల నేతకారులకు కేటాయించారు. చేనేత చాలా నైపుణ్యంతో కూడిన కళ. మేలైన ముడిసరుకుతో కళాత్మకంగా తయారు చేసిన వస్త్రం ధర కూడా ఎక్కువే ఉంటుంది. ధర వెనుక చేనేతకారుల శ్రమను చూడగలగాలి. ఎన్ని సంస్కతులైనా రావచ్చు, పోవచ్చు. కానీ ఒక కళ అంతరించి పోకూడదు. మనదైన కళను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం, నేతన్నలు కూడా కృషి చేయాలి.