Home దునియా పోషకాల పండు నేరేడు

పోషకాల పండు నేరేడు

Many Proteins in Java Plum

సహజసిద్ధంగా లభించే పళ్లలో నేరేడు పండు మంచి ఆరోగ్యాన్నిచే పండు. ఇది పండుగానే కాదు ఈ చెట్టు బెరడు, పండులోపలి గింజలు, చెట్టు ఆకులు కూడా చాలా ఔషధాలలో  ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఒక వరం. ఇంకా గుండెజబ్బులు, దంతసమస్యలను నివారిస్తుంది.

శరీరాన్ని డీ హైడ్రేషన్‌నుండి కాపాడుతుంది. చర్మ సంరక్షణకి తోడ్పడుతుంది. ఎముకలు గట్టిగా ఉండటానికి, శ్వాససంబంధిత సమస్యలు రాకుండా ఉండటానికి నేరేడు ఎంతో సహకరిస్తుంది.  చీము వంటి గాయాలు మానటానికి నేరేడు ఆకులను పూర్వకాలంలో వాడేవారు.  కడుపులో గ్యాస్ ఏర్పడి అజీర్ణం అయితే నాలుగైదు నేరేడుపండ్లను తింటే ఉపశమనంగా ఉంటుంది. నేరేడు పండు జ్యూస్‌లో బ్లాక్ సాల్ట్, జీలకర్ర పౌడర్ వేసి తాగిటే ఎసిడిటి తగ్గుతుంది.
ఒక ఒక స్పూన్ జామున్ జ్యూస్ లో, తేనె, ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది.  కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నేరేడులో విటమిన్ -ఎ, సివంటి పోషకా లుంటాయి. ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి.

స్కిన్ రాషెష్‌ను రాకుండా చర్మాన్ని కాపాడుతుంది.. నేరేడు గింజలను పౌడర్ చేసి, ఆ పౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే ముఖం మీద మొటిమలు నివారింపబడి, ప్రకాశవంతంగా వస్తుది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్దాప్యం ఆలస్యం చేస్తుంది.  నేరేడు ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గు తాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన పోతుంది.