Home జాతీయ వార్తలు మావోయిస్టు ఎన్‌కౌంటర్

మావోయిస్టు ఎన్‌కౌంటర్

Maoist Encounter at Chhattisgarh

భద్రాద్రి కొత్తగూడెం : పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. పలువురు మావోయిస్టులు గాయపడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టు మృత దేహం, మావోయిస్టులకు సంబంధించిన సామగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు దళ కమాండర్ జగ్గూని పోలిగా పోలీసులు అనుమానిస్తున్నారు.