Home భద్రాద్రి కొత్తగూడెం రణ రీతికి పదును

రణ రీతికి పదును

Naxalite

భద్రాచలం:  మావోయిస్టులు తమ రణరీతిని మార్చారు. చెట్ల మాటు నుంచి దాడులకు పాల్పడే వారు యుద్ధ తంత్రాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ల్యాండ్ మైన్లు, నేరుగా కాల్పులు చేయడం, పట్టుకుని మట్టుపెట్టడం వంటి చర్యలకుపాల్పడే వారు ఇప్పుడు నూతన యుద్ధ పంథాతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. గత వారం రోజుల క్రితం బెజ్జి పోలీస్ అటవీ ప్రాంతంలో పోలీసులపైవారు అనుసరించిన యుద్ధ తీరును చూస్తే ప్రభుత్వానికి అంతుచిక్కకుండా ఉంది. ఏకంగా బాణాలకు బాంబులను కట్టి రాంబో తరహా యుద్ధతంత్రాన్ని అనుసరిస్తున్నారు.

చెట్లపై ఉండి బాంబులు అమర్చిన బాణాలను వదలడం ద్వారా పోలీసులు చెల్లా చెదురువాకడమే కాకుండా ప్రాణ నష్టం సైతం జరిగే అవకాశం. ఈ తరహా దాడి నుంచి పోలీసులు తేరుకునేలోపే బాంబులు, తుపాకుల మోత మోగించి మట్టు పెడుతున్నారు. గత వారం రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతంలో అచ్చూ ఇదే చోటు చేసుకుంది. బాణాల ద్వారా వదిలే బాంబుల్లో విషపూరిత ఇనుప ముక్కలు, గాజు పెంకులు, మేకులు, ఇనుప గుండ్లు వంటి వాటిని అమర్చి బాంబులను తయారు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా పోలీసులపై ఆదిపత్యాన్ని సాగించేందుకు యుద్ధ తంత్రాలు పన్నుతున్నారనే నుమాలు బలంగా ఉన్నాయి. మారుతున్న పరిస్థితులను బట్టి, బలహీన పడుతున్న మావోయిస్టు దళంలో ఉన్న వారికి మనోధైర్యాన్ని కల్పించేందుకు కొత్తపుంతలకు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మావోయిస్టులను తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సమకూర్చడమే కాకుండా వారి ఆన వాళ్లులేకుండా చేసేందుకు బలగాలను సిద్ధం చేస్తూ గ్రీన్
హాంట్ పేరుతో పోరు సలుపుతోంది. ఏఓబి ఎన్ కౌంటర్లో 30 మంది మావోయిస్టులు హతమైన తర్వాత తమ ఉనికిని చాటుకునేందుకు వ్యూవప్రతివ్యూహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ తరహా యుద్ధ తంత్రానికి తెరలేపినట్లు సమాచారం.

భద్రతా బలగాల వద్ద ఉన్న అధునాత ఆయుధలకు మించి మావోల యుద్ధ తంత్రం ఉండటంతో ఇటుపోలీసులు, అటు ప్రభుత్వాలు బెంబేలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రోబోలను అడవుల్లో ప్రవేశపెట్టి మావోలు అమర్చిన ల్యాండ్ మైన్లను కనుగునేలా చర్యలు తీసుకునేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మావోలు వాడుతున్న రాంబో తరహా యుద్ధ విన్యాసాలను పసిగట్టడం ఆ రాబోలకు కష్టమయ్యే అవకాశాలు లేకపోలేదని వాదన వినవస్తోంది. ప్రస్తుతం మావోలు చెట్లపై ఉండి బాంబులు అమర్చిన బాణాలను వదలుతున్నారు. వీటిని కనుగొనడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పటికప్పుడు మావోలు తమ వ్యూహరనచనల్లో మార్పులు చేస్తూ సన్నగిల్లుతున్న ఉద్యమానికి కొత్తనెత్తురెక్కించి, అటవీ గ్రామాల్లో ఉండే యుతను ఆకర్షించి తమ బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రారంభమైన ఆపరేషన్ గ్రీన్ హాంట్ – 3 ఆకురాలే ఈ కాలంలో పోలీసులకు కలిసి రావచ్చేమే గానీ, చెట్లు చిగురించి పెద్ద ఎత్తున ఆకులు వచ్చిన తర్వాత మావోల కొత్త యుద్ధ తంత్రాల వద్ద పోలీసులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాల నడుమ సాగుతున్న పోలీస్ – మావోల పోరు దండకారణ్యంతో పాటు ఏఓబి ప్రాంతాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.