Home జాతీయ వార్తలు ఆస్పత్రికి మావోయిస్టుల మృతదేహాలు తరలింపు

ఆస్పత్రికి మావోయిస్టుల మృతదేహాలు తరలింపు

BREAKINGభద్రాచలం : ఖమ్మం – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. మావోయిస్టుల మృతదేహానికి ఇక్కడే శవపరీక్ష నిర్వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా దక్షిణ బస్తర్ ఏరియాలోని చింతవాడు అటవీప్రాంతం గొట్టెపాడు పరిసరాల్లో చర్ల మండలం కేంద్రం సరిహద్దుకు 15కిలోమీటర్ల దూరంలో మంగళవారం భద్రతా బలగాలు , మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎస్ , గ్రేహౌండ్స్ బలగాలు , పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి మావోయిస్టులు ఎదురుకావడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు సహా 8 మందివ మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి ఏకే47,6 ఎస్‌ఎల్‌ఆర్‌లు, మూడు 308 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు.