Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పార్టీలను మించి ప్రచారం

ఛత్తీస్‌గఢ్‌లో ఇసి, మావోయిస్టుల పోస్టర్ వార్

Chhatishgarh

దంతెవాడ/ సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లో ఒకవంక అధికారంలో ఉన్న బారతీయ జనతాపార్టీకి, ఆ పార్టీకి సవాలుగా మారిన కాంగ్రెస్ పార్టీకి మధ్య రాజకీయ పోరాటం జరుగుతుంటే, ఇంకోవంక మరో పోరు కూడా అక్కడ నడుస్తోంది. రాష్ట్రంలో నక్సల్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నక్సల్స్‌కు, ఎన్నికల అధికారులకూ మధ్య గోడలు, హోర్డింగ్స్‌కు సంబంధించి యుద్ధం సాగుతోంది.’ఓట్ల పండగ జరుపుకోండి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల సంఘం స్థానిక గోండి భాషలో పోస్టర్లు ఏర్పాటు చేసింది. విశేషమేంటంటే ఈ పోస్టర్లు …సంఖ్యలోనూ, సైజులోనూ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే పోస్టర్లను మించిపోయాయి.అంతేకాదు. చాలా పోలింగ్ కేంద్రాల్ని ఆలయాలను తలపించేలా అలంకరించారు.

నక్సల్స్‌ను ఢీకొనేందుకు…

ఓటు వేయవద్దని ప్రజలకు చెబుతూ నక్సల్స్ వేసిన పోస్టర్లకు వ్యతిరేకంగా, ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ పోస్టర్లు తయారుచేశామని అధికారులు ప్పారు.ఎన్నికలను బహిష్కరించమని ప్రజలకు పిలుపునిస్తూ నక్సల్స్ తమకు బాగా పట్టున్న దంతెవాడ, సుక్మా ప్రాంతాల్లోని మారుమూల ప్రదేశాల్లో పోస్టర్లు వేశారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నక్సల్స్ పోస్టర్లే కనిపిస్తాయి. ఇకపోతే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పాలనాయంత్రాంగం, ఎన్నికలఅధికారులు కూడా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనిప్రచారం చేస్తున్నారు. నక్స ల్ ప్రభావిత ప్రాంతాల్లోని ఓటర్లు, వికలాంగులను ,స్థానిక మహిళా స్వయంసహాయక బృందాలను పోలిం గ్ బూత్‌ల వద్దకు రప్పించేందుకు… కానుకలు ఇస్తామని చెబుతున్నారు. వారి రుణాల్లో అయిదుశాతం మాఫీ చేస్తామని ప్రకటించారు. అంతేకాక, అతి సెన్సిటివ్ ప్రాం తంగా భావించే సుక్మాలో ఏర్పాటు చేసే 232 పోలింగ్ కేంద్రాలకు ఆలయాలకు మాదిరిగా పెయింటింగ్, కలరింగ్ చేయాలని కూడా ఎన్నికల బృం దం ఆలోచిస్తోందని జిల్లా కలెక్టర్ అమిత్ కుమార్ మౌర్య చెప్పారు. ‘ఓటర్లకు అందుబాటులో ఉండేలా జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాలను హెలికాప్టర్ ద్వారా కానీ, సైకి ల్ లేదా కాలినడకన గానీ మరో చోటికి తరలిస్తాం. అలా గే, ఏజెంట్లు కూడా వేరేచోట ఏర్పాటుచేసే ఈ పోలింగ్ కేంద్రాలకు వెడతారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌కేంద్రాలకు చేరాలంటే ఏజెంట్లు ఓ నదిని దాటాల్సిన పరిస్థితి ఉంది.

గత ఎన్నికల్లో…

గత ఎన్నికల్లో 42 పోలింగ్ కేంద్రాల్లో 0 నుంచి-10 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. అయితే ఈసారి పోలింగ్ రోజును ఓ పండగ రోజులా ఓటర్లు భావించేలా చేయాలని పాలనాయంత్రాంగం కృషి చేస్తోంది. ‘పోలింగ్ బూత్‌కు ఓటు వేయడానికి వచ్చినట్టు కాకుండా, పండగరోజు ఆలయానికి వెడుతున్నట్టు ఓటర్లు భావించాలి. ప్రజాస్వామ్యంకోసం మేము కూడా ఓ యుద్ధాన్ని చేస్తున్నాం’ అని కలెక్టర్ మౌర్య తెలిపారు. 2013నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 48 శాతం ఓట్లు పోలయ్యాయని, ఈసారి 65 శాతం పైగా పోలింగ్ జరగవచ్చన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారాయన.

మరో అడుగు ముందుకు…

సుక్మా జిల్లాకు ఆనుకొని ఉన్న మరో నక్సల్ ప్రభావిత ప్రాంతం దంతెవాడ. ఇక్కడ మరో ముందడుకు పడింది. గత ఇరవై ఏళ్లలో ఓటింగ్ అంటే తెలీని ఈ హైపర్ సెన్సిటివ్ నక్సల్ ప్రాంతంలో …మొదటిసారి పోలింగ్‌కోసం మూడు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ‘తెలం, తెటం, గౌట్సే…ఇవి మూడు పోలింగ్ కేంద్రాలు.ఇరవై ఏళ్ల తర్వాత ఇక్కడ మొదటిసారి పోలింగ్ జరగబోతోంది’ అని దంతెవాడ జిల్లా కలెక్టర్ సౌరవ్ కుమార్ తెలిపారు. తల్లిదండ్రులను ఓటు వేయమని కోరుతూ బోర్డింగ్ స్కూల్లో చదివే పిల్లలు ఉత్తరం రాసే ఒక ప్రత్యేకమైన పోటీని జిల్లా యంత్రాంగం నిర్వహించింది.

భద్రతా ఏర్పాట్లు

ఇక భద్రతా ఏర్పాట్ల గురించి చెబుతూ… ఎన్నికలకోసం ఈ ప్రాంతంలో తగిన సంఖ్యలో భద్రతా దళాలను నియోగిస్తున్నామన్నారు. పోలింగ్ ఏజెంట్లందరికీ స్థానిక పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బలగాల రక్షణ ఉంటుందని దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ్ అన్నారు. ప్రెజర్ బాంబులు, స్పైక్స్, ఐఇడీలవల్లే బెడద ఎక్కువని, వాటిని కనిపెట్టడం కష్టమని చెబుతూ…అయితే ఎక్కడ ఏది ఉన్న కనిపెట్టేలా పోలింగ్ జరిగే ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉంచుతామని ఆయన తెలిపారు.నవంబర్ 12న తొలి విడతలోనే ఈ ప్రాంతంలో పోలింగ్ జరుగుతుంది. బస్తర్‌లోని బీజాపూర్, దంతెవాడ, కొంటా, చిత్రకూట్, బస్తర్, నారాయిన్‌పూర్, కొండగావ్, కేష్‌కల్, కంకేర్, భానుప్రతాప్ పూర్, అంటాగశ్, జగదల్‌పూర్‌లలో ఆ రోజు పోలింగ్ జరుగుతుంది.

Maoists Campaign against Chhattisgarh Elections

Telangana news

Comments

comments