Home జాతీయ వార్తలు మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర

మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర

Maoists Conspiracy to Kill PM Narendra Modi

ముంబయి : ప్రధాని నరేంద్రమోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. మావోయిస్టులు నిర్వహిస్తోన్న ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను పుణె పోలీసులు చేధించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య చేసిన తరహాలోనే మోడీని కూడా చంపాలని మావోయిస్టు అగ్రనేత ప్రకాశ్‌కు కొందరు మావోలు లేఖ రాసినట్టు వెలుగుచూసింది. మోడీ బహిరంగ సభల్లో పొల్గొన్నప్పుడు, లేదా రోడ్ షో నిర్వహించిన సమయంలో ఆయనపై దాడి చేయాలని మావోయిస్టులు వ్యూహం పన్నినట్టు నిఘావర్గాలకు సమాచారం అందినట్టు తెలిసింది. ఈ లేఖను గత ఏప్రిల్ 17వ తేదీన రాసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Maoists Conspiracy to Kill PM Narendra Modi