Home జాతీయ వార్తలు మావోయిస్టుల డంప్ స్వాధీనం

మావోయిస్టుల డంప్ స్వాధీనం

Maoists Dumpఛత్తీస్‌గఢ్ : రాజ్ నందుగావ్ జిల్లా గట్ఫార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నక్టిఘటి అడవి ప్రాంతంలో మావోయిస్ట్ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో విప్లవ సాహిత్యం, 14. డిటోనేటర్లు, 1 పిపి బాంబ్, గన్ పౌడర్, జోడి పిత్, రోజూ వారి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్ట్ ల డంపు ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టుల డంప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మావోల కోసం భారీ ఎత్తున పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు కూంబింగ్ తో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్ గఢ్ లో పోలీసులు మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

Maoists Dump Seized in Chhattisgarh