Home జాతీయ వార్తలు కాంట్రాక్టర్‌ను హత్య చేసిన మావోయిస్టులు

కాంట్రాక్టర్‌ను హత్య చేసిన మావోయిస్టులు

Maoists Killed the Contractor at Sukma District

ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో కపూర్ రాజ్ పూత్ అనే రోడ్డు కాంట్రాక్టర్‌ను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటన పోలంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసు ఇన్‌ఫార్మర్ అన్న నెపంతో కపూర్‌ను మావోయిస్టులు హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ హత్యపై పోలీసులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. కపూర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Maoists Killed the Contractor at Sukma District