Home తాజా వార్తలు పోలీస్ వలయంలో దండకారణ్యం

పోలీస్ వలయంలో దండకారణ్యం

Maoists Wall Papers Creating Tension In badradri

టెన్షన్ … టెన్షన్ ….
 ఏజెన్సీలో అలుముకున్న యుద్ధ మేఘాలు
బంద్‌ను విజయవంతం చేయాలంటూ మావోల కరపత్రాలు
కందకాలు తవ్వి పోస్టర్లు వేసిన మావోయిస్టులు
విస్తృతంగా కూంబింగ్

భద్రాచలం :ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం అలుముకుంది. మావోయిస్టులు తెంలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో యుద్ధ వాతవరణం అలుముకుంది. ఇప్పటికే వరుస ఘటనలతో పెద్ద ఎత్తున నష్టాన్ని చవి చూసిన మావోయిస్టు పార్టీ పట్టు నిలుపుకునేందుకు పాకులాడే అవకాశంలేకపోలేదని వాదన బలంగా ఉంది. దీంతో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఏజెన్సీతో పాటు దండకారణ్యం అంతా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. గత రెండు మాసాలుగా దెబ్బమీద దెబ్బతింటున్న మావోయిస్టులు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. అందివచ్చే ప్రతీ చిన్న అవకాశాన్ని సైతం సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడువువిపై అనువనువుగా పట్టున్న మావోయిస్టులు మావోయిస్టులు కూంబింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ల్యాండ్ మైన్లు అమర్చినట్లు పుకార్లు వినవస్తున్నాయి.
కరపత్రాలు, కందకాలు: ఈనెల 4న మావోయిస్టులు బంద్‌కు పిలుపిచ్చారు. ఈ బంద్ ను విజయవంతం చేయాలంటూ సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖలు సైతం విడుదల చేసిన విషయం విధితమే. ఆ లేఖలను బలపరుస్తూ మావోయిస్టు శబరి, చర్ల ఏరియా కమిటీల పేరుతో మంగళవారం అర్థరాత్రి పాతచర్ల, లెనిన్ కాలనీ ప్రాంతాల్లో కరపత్రాలు వదిలారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాటినిస్వాదీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కరపాత్రలను మోటార్ సైకిల్ పై వచ్చి వదిలివెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భేరాంగఢ్, కేస్ కుతూర్ మార్గాల మధ్యలో రోడ్డును అడ్డంగా తవ్విన మావోయిస్టులు బ్యానర్ సైతం కట్టారు. గడ్చిరోలితో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని, ఆహారంలో విషమిచ్చి చంపేస్తున్నారని పేర్కొన్నారు. బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగానే బంద్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
పోలీస్ వలయంలో దండకారణ్యం: దండకారణ్యంలో పోలీస్ వలయంలో ఉంది. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చేసేందుకు కట్టుదిట్టమైన భద్రతను పెంచుకున్నారు. అంతరాష్ట్ర రహదార్లపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దండకారణ్యంలోని అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ సాగుతోంది. మావోయిస్టులు విరుచుకు పండేందుకు అనువుగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గస్తీ గాస్తున్నారు. సమాచార సేకరణ కోసం ఇప్పటికే కోవర్టు వ్యవస్థను బలోపేతం చేసుకున్న వారు దానిని మరింత బలపరిచుకునే పనిలో ఉన్నారు. యువత విప్లవోద్యమానికి ఆకర్షితులు కాకుండా ఉండేందుకు చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారు.
ఓ ప్రక్క మావోయిస్టుల కార్యకలాపాలు, మరో ప్రక్క పోలీసు ల నిఘా, తనిఖీలతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.