Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చర్మ సంరక్షణకు వేప, పెరుగు

Facepackఅందంగా, మృదువుగా కనపడేందుకు ఎన్నోరకాల క్రీమ్స్ వాడుతుంటారు కొంతమంది మహిళలు. అయినా, వారి చర్మం చూడడానికి అంత బాగుండదు. ఈరోజుల్లో మహిళలూ కూడా చాలామంది ఉద్యోగాలు చేస్తూ, పని ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. అయితే, వీరు చర్మ సంరక్షణకు సమయం కేటాయించాలన్నా దొరకడం లేదు. దీనివల్ల, ఇలాంటి మహిళలకు చర్మ సమస్యలను ఎదుర్కొక తప్పడం లేదు. అధిక డబ్బులు పెట్టి క్రీములు పెట్టి కొనే బదులు, సహజసిద్ధమైన పెరుగు, వేపల మిశ్రమం ముఖానికి పట్టేస్తే, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అదెలాగంటే..? కొన్ని వేప ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు మిక్స్ చేసి గ్రైండర్ లో వేసి పేస్ట్‌లాగ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. తర్వాత, అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఈ పెరుగు, వేపలతో తయారుచేసిన మిశ్రమం(ఫేస్‌ప్యాక్)లో విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మకణాలకు పోషణ అందిస్తాయి. ఆ కణాలు ఆరోగ్యంగా మారి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అదేవిధంగా, మొటిమలతో బాధపడే వారు ఈ ఫేస్‌ప్యాక్‌ను ప్రతిరోజూ వాడితే, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. ముఖంపై ఉన్న మచ్చలు తొలగి, చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మ కణాలను మాయిశ్చరైజ్ చేసే గుణం పెరుగు కు ఉంటుంది కనుక, ఈ ప్యాక్ ని రెగ్యులర్ ఉపయోగిస్తే మీ చర్మం సాఫ్ట్ గా మారుతుంది. వేప, పెరుగు హోంమేడ్ ఫేస్ ప్యాక్.. డార్క్ స్పాట్స్ ని, బ్లాక్ హెడ్స్ ని చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. సూర్య కిరణాల వల్ల చర్మానికి హాని కలుగకుండా ఈ వేప, పెరుగు మిశ్రమం న్యాచురల్ సన్ స్క్రీన్‌లా ఉపయోగపడుతుంది. వేప, పెరుగు మిశ్రమం ఘాట్లు, తెగిన గాయాలను, కాలిన మచ్చలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు… ఎలాంటి గాయాన్నైనా తేలికగా నయం చేస్తాయి.

Comments

comments