Home జాతీయ వార్తలు భారీగా గంజాయి పట్టివేత

భారీగా గంజాయి పట్టివేత

Marijuanaహైదరాబాద్‌ :  రూ.1,68,22,500 విలువైన 11 క్వింటాళ్ల 21 కిలోల గంజాయిని హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న డిసిఎం వాహనాన్ని సీజ్ చేశారు. మహారాష్ట్ర శోలాపూర్‌లోని సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు ఈ గంజాయిని తరలిస్తుండగా పంతంగి టోల్‌గేట్‌ వద్ద పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నార్కొటిక్ డ్రగ్స్ యాక్టు కింద వీరిపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.

Marijuana Seized at Panthangi Toll Gate