హైదరాబాద్ : నగరంలోని పాత షఫీల్గూడ క్రాస్‌రోడ్డులో ఆబ్కారీ శాఖ అధికారులు ఆదివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రూ.16లక్షల విలువైన 135 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహేష్, కార్తీక్, రాజమణి అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆబ్కారీ అధికారులు తెలిపారు.