Home ఖమ్మం భారీగా గంజాయి పట్టివేత

భారీగా గంజాయి పట్టివేత

Marijuana

ఖమ్మం : కల్లూరు , ఏదులాపూరంలో శుక్రవారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. కల్లూరు వద్ద 60 కిలోలు, ఏదులాపూరంలో 46 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రెండు లారీలను సీజ్ చేసి, ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.47 లక్షల వరకు ఉంటుందని వారు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Marijuana Seized in Khammam on Friday