Home ఆఫ్ బీట్ ప్రేమ మందిరానికి ప్రాణసంకటం

ప్రేమ మందిరానికి ప్రాణసంకటం

Marine and water pollution will turn into marble wheat

నోబుల్ బహుమతి గ్రహీత, ప్రముఖ కవి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తాజ్ మహల్ గురించి, కాలం చెక్కిలిపై అశ్రుబిందువు అని కవితాత్మకంగా అభివర్ణించారు. ఇప్పుడు తాజ్ మహల్ దీనావస్థ చూసి కన్నీళ్ళు పెట్టుకునే కాలం వచ్చింది. తాజ్ మహల్ పరిరక్షణ కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఎం.సి.మెహతా దీని గురించి మాట్లాడుతూ నిర్మాణంలో బీటలు కనబడుతున్నాయిని, మినార్లు వంగిపోతున్నాయిని, కట్టడం నుంచి రాళ్ళు, సున్నం రాలిపడుతున్నాయిని, తీవ్రమైన వాయు కాలుష్యం, నీటి కాలుష్యాల వల్ల పాలరాయి గోధుమవర్ణంగా మారిపోతుందని అన్నారు. భూకబ్జాలు, పరిశ్రమలు ఆ చుట్టుపక్కల ఎక్కువయ్యాయి. సిసిటీవీలు పనిచేయవు. చుట్టుపక్కల ఉన్న డ్రెయినేజీలన్నీ పొంగిపొర్లుతుంటాయి. పక్కనే ప్రవహించే యమునా నదిలో మురికినీరే ఉంటుంది. అక్కడి నుంచి దోమల సైన్యాలు తాజ్ పై దాడులు చేస్తుంటాయి. తాజ్ మహల్ సందర్శించడమంటే రోగాల పుట్టవద్దకు వెళ్ళడంగా ఇప్పుడు మారింది.

ఇండియా అనగానే విదేశీయులకు మొదట గుర్తొచ్చేది తాజ్ మహల్. ఇప్పుడా తాజ్ మహల్ పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వంపై, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై, అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీరు కావాలనుకుంటే తాజ్ మహల్ మూసేయండి, ఇంకా కావాలనుకుంటే దాన్ని కూల్చేయండి, మీరు ఇప్పటికే నిర్ణయించుకుని ఉంటే ఆ పనులు చేసేయండి అని వ్యాఖ్యానించింది. అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఏ.యస్.నద్ కర్ణీతో న్యాయమూర్తులు తీవ్రస్వరంతో మాట్లాడారు. ”మీరేం చేయాలనుకుంటున్నారో యాక్షన్ ప్లాన్ మాకు చెప్పండి. అది చూసి మేం ఈ కేసు ముగిస్తాం. తాజ్ మూసేయాలనుకుంటే మూసేయండి.“ అన్నారు. ఫ్రాన్సులోని ఈఫిల్ టవర్ తో పోల్చుతూ, తాజ్ అంతకన్నా అందమైంది కాని ఇండియా నిర్లక్ష్యం వల్ల టూరిస్టులను కోల్పోతుంది. అక్కడ ఎనిమిది కోట్ల మంది ఈఫిల్ టవర్ చూడ్డానికి వెళతారు. ఇక్కడికి కేవలం కోటిమంది వస్తున్నారని వ్యాఖ్యానించింది. మీరు కావాలనుకుంటే తాజ్ మహల్ నాశనం చేయండి. కాని మాకు మాత్రం తాజ్ నాశనం కావడం ఇష్టంలేదని చెప్పింది.
షాజహాన్ చక్రవర్తి కట్టించిన తాజ్ మహల్ నేటికి కూడా దేశంలో టూరిస్టులు అత్యధికంగా సందర్శించే స్థలం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2014-15లో తాజ్ మహల్ వల్ల ఆదాయం 21.23 కోట్ల రూపాయలు. ఆ తర్వాతి స్థానంలో ఆగ్రాకోట 10.58 కోట్ల రూపాయలు. ఎర్రకోట ఆదాయం 5.9 కోట్ల రూపాయలు. దేశంలో అత్యధికంగా టూరిస్టుల నుంచి విదేశీ మారకద్రవ్యం సంపాదిస్తున్నది కూడా తాజ్ మహలే. కాని విచిత్రంగా ఉత్తరప్రదేశ్ టూరిస్ట్ గైడులో యోగీ ఆదిత్యనాథ్ సర్కారు తాజ్ మహల్ లేకుండా చేసింది. బిజేపి నాయకుడు సంగీత్ సోమ్ ప్రకారం తాజ్ మహల్ భారత చరిత్రపై నల్లని మచ్చ. సుబ్రహ్మణ్యస్వామి తాజ్ మహల్ కట్టిన నేల హిందూ రాజుల నుంచి లాక్కుంది, వినయ్ కతియార్ మరికాస్త ముందుకు వెళ్ళి దాన్ని కట్టింది ముస్లిములు కాదు హిందూ రాజులంటాడు. యోగీ ఆదిత్యనాథ్, బిజేపి ముఖ్యమంత్రి తాజ్ మహల్ లో భారతీయత లేదన్నది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి భావన. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోను, కేంద్రంలోను భారతీయ జనతాపార్టీయే అధికారంలో ఉంది కాబట్టి తాజ్ మహల్ పరిరక్షణ పట్ల ఎలా వ్యవహరిస్తారన్నది వేరే చెప్పనవసరం లేదు.
నోబుల్ బహుమతి గ్రహీత, ప్రముఖ కవి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తాజ్ మహల్ గురించి, కాలం చెక్కిలిపై అశ్రుబిందువు అని కవితాత్మకంగా అభివర్ణించారు. ఇప్పుడు తాజ్ మహల్ దీనావస్థ చూసి కన్నీళ్ళు పెట్టుకునే కాలం వచ్చింది. తాజ్ మహల్ పరిరక్షణ కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఎం.సి.మెహతా దీని గురించి మాట్లాడుతూ నిర్మాణంలో బీటలు కనబడుతున్నాయిని, మినార్లు వంగిపోతున్నాయిని, కట్టడం నుంచి రాళ్ళు, సున్నం రాలిపడుతున్నాయిని, తీవ్రమైన వాయు కాలుష్యం, నీటి కాలుష్యాల వల్ల పాలరాయి గోధుమవర్ణంగా మారిపోతుందని అన్నారు. భూకబ్జాలు, పరిశ్రమలు ఆ చుట్టుపక్కల ఎక్కువయ్యాయి. సిసిటీవీలు పనిచేయవు. చుట్టుపక్కల ఉన్న డ్రెయినేజీలన్నీ పొంగిపొర్లుతుంటాయి. పక్కనే ప్రవహించే యమునా నదిలో మురికినీరే ఉంటుంది. అక్కడి నుంచి దోమల సైన్యాలు తాజ్ పై దాడులు చేస్తుంటాయి. తాజ్ మహల్ సందర్శించడమంటే రోగాల పుట్టవద్దకు వెళ్ళడంగా ఇప్పుడు మారింది.
ప్రపంచవింతల్లో ఒకటిగా పరిగణించబడే తాజ్ మహల్ విషయంలో మన నిర్లక్ష్యాన్ని భావితరాలు క్షమిస్తాయా? రోమ్ లోని కొల్లోజియంను మూడేళ్ళ కాలం అవసరమైన మరమ్మత్తులతో పూర్తి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇటీవల తెరిచారు. ప్రపంచంలోని చారిత్రక కట్టడాలను పర్యవేక్షించే యునెస్కో తాజ్ మహల్ పరిరక్షణ విషయంలో సమగ్ర నిర్వహణ పథకం అవసరమని సూచించింది. కాని దేశంలో పర్యావరణం పట్ట, చారిత్రక వారసత్వాల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది. టూరిస్టులను ఆకర్షించడానికి అవసరమైన స్థలాలు మనవద్ద అనేకం ఉన్నప్పటికీ మన టూరిజం పరిశ్రమ వెనుకబడే ఉంది. సింగపూర్ అతి చిన్న దేశం. భారతదేశంతో పోల్చితే అక్కడ చారిత్రక కట్టడాలు కూడా లేవు. తాజ్ మహల్ స్థాయి కట్టడం సింగపూరులో కాగడా పెట్టి వెదికినా దొరకదు. కాని సింగపూరుకు ఏటా కోటి డెబ్బయి లక్షల మంది టూరిస్టులు వస్తుంటే, భారతదేశానికి కోటి మంది వస్తున్నారు. తాజ్ మహల్ దీనావస్థకు చాలా కారణాలున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, మొగల్ కట్టడం కావడం వల్ల కొన్ని రాజకీయ శక్తుల విద్వేషం, నిర్వహణ లోపం ఇలా అనేక కారణాలు. గత 370 సంవత్సరాలుగా తాజ్ మహల్ అనేక సవాళ్ళను ఎదుర్కుంది. అనేక యుద్ధాలను తట్టుకుంది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కుంది. తాజ్ మహల్ పాలరాతితో కట్టిన శ్వేతసౌధం. ఇది ప్రేమచిహ్నం. షాజహాన్ చక్రవర్తి భార్య సమాధి ఇందులో ఉంది. తెల్లగా మెరిసే తాజ్ ఇప్పుడు పసుపు, గోధుమ, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో మారిపోతుంది. అసలు రంగేమిటో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.
షాజహాన్ ఆ కాలంలో ప్రపంచ జిడిపిలో 20 శాతం జిడిపి కలిగిన సామ్రాజ్యానికి చక్రవర్తి. మొగల్ రికార్డుల ప్రకారం తాజ్ మహల్ నిర్మాణంలో హిందూ, ముస్లిం వాస్తుశిల్పులు పాలుపంచుకున్నారు. యూరోపియన్ ఆర్కిటెక్ట్ లు కూడా ఉన్నారు. తాజ్ మహల్ అసలు పేరు రోజాయే ముంతాజ్. పర్షియన్ భాషలో రోజా అంటే సమాధి అని అర్ధం. ఈ పేరు పలకలేని ఈస్ట్ ఇండియా కంపెనీ ముంతాజ్ మహల్ కాస్త తాజ్ మహల్ గా మార్చేసింది. ఇది తాజ్ మహల్ కాదు, తేజోమహాలయం అని వివాదం కూడా నడిచింది. దీన్ని హిందూ దేవాలయంగా ప్రకటించాలని కేసులు కూడా వేశారు. అక్కడ పూజలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. ఇంతకు ముందు 2000లో అలాంటి పిటీషన్లను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు తాజ్ మహల్ కు సంబంధించి ఎలాంటి కేసులు కూడా క్రింది కోర్ట్టులు తీసుకోరాదని చెప్పింది. ఇలాంటి కేసులు తాజ్ మహల్ పై చాలా ఉన్నాయి. తాజ్ మహల్ చుట్టు ఉన్న 450 చెట్లను నరికి, రైల్వే ట్రాక్ వేయానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఒక కేసు వేశారు.
తాజ్ మహల్ పరిరక్షణ కోసం పర్యావరణ కార్యకర్త, సుప్రీంకోర్టు లాయరు ఎం.సి.మెహతా 1984లో కేసు వేశారు. పన్నెండు సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు 1996లో ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేస్తూ తాజ్ ట్రెపీజియం జోన్, యమునా ప్రక్షాళన వగైరా చర్యలు సూచించింది. ఇప్పుడు మరో 22 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ప్రభుత్వవైఖరికి విసిగి, మీరు పునరుద్ధరిస్తారా, లేక కూల్చివేస్తారా లేక మమ్మల్ని మూసేయమంటారా అని నిలదీసింది. 1996లో కాలుష్యరహిత మండలంగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన ట్రెపీజియం జోన్ ఇప్పుడు అత్యంత కాలుష్యభరిత ప్రాంతంగా మారింది. తాజ్ వెనక ప్రవహించే యమునా నది ప్రపంచంలో అత్యంత కలుషిత జలాల నదుల్లో ఒకటి. 1978లో ప్రభుత్వం కాలుష్యం వల్ల తాజ్ మహల్ కు కలిగిన నష్టం గురించి ఒక రిపోర్టు ప్రచురించింది. అప్పటి నుంచి ఇప్పటికి పరిస్థితి మరింత దిగజారిందే కాని ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలేవీ లేవు. అయినా నేటికి కూడా దేశంలో అత్యధికంగా ఆదాయం సంపాదించి పెట్టే చారిత్రక కట్టడం తాజ్ మహలే.