Home తాజా వార్తలు జిడిపితో జోష్

జిడిపితో జోష్

market experts on how to predict stock movement

రూపాయి, వాహన సేల్స్ కీలకం                                                                                                                              ఈవారం మార్కెట్‌పై నిపుణులు అంచనా

న్యూఢిల్లీ: జిడిపి(స్థూల దేశీయోత్పత్తి), జిఎస్‌టి వసూళ్లు, రూపాయి కదలికలు వంటి అంశాలు ఈ వారం స్టాక్‌మార్కెట్లను శాసించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. గతవారం ఈక్విటీలు కొత్త సిరీస్‌ను ఆశించినంత మెరుగ్గా ప్రారంభించలేదు. వారాంతం శుక్రవారం నాటికి నిఫ్టీ 11,700 పాయింట్ల మార్క్ దిగువన ముగిసింది. బలహీనంగా రూపాయి, ముడి చమురు ధరల పెరుగుదలకు తోడు మిడ్ క్యాప్‌లో అమ్మకాలు సూచీలు వెనకడుగు వేయడానికి కారణయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రక కనిష్టం 71కి పడిపోయింది. అయితే ఈవారం మార్కెట్లకు దేశ ఆర్థిక పురోగతి జోష్ నివ్వనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆగస్ట్ 31న మార్కెట్లు ముగిశాక కేంద్ర గణాంకాల శాఖ జిడిపి వివరాలను ప్రకటించింది.

రెండో త్రైమాసికంలో దేశ జిడిపి 8.2 శాతానికి పెరిగింది. గత రెండేళ్లలోనే ఇది అత్యధికం, అయితే 2016 రెండో త్రైమాసికంలో మాత్రమే గరిష్ఠ స్థాయిలో 9.3 శాతం జిడిపి నమోదైంది. ప్రధానంగా పరిశ్రమలు, వ్యవసాయ రంగాలు మెరుగవడం, వినియోగం పుం జుకోవడం వంటి కారణాలతో ఆర్థిక వ్యవస్థ పటి ష్ట వృద్ధిని సాధించిందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, వ్యవసాయ రం గంలో విలువ జోడిం పు వంటి అంశా లు జిడిపికి బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. దీంతో సోమవారం దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే వీలున్నట్లు నిపుణు లు అంచనా వేస్తున్నా రు. ఈ వారం అంతర్జాతీ య అంశాలపైనా దృష్టిపెట్టాలని వారు సూచిస్తున్నారు.

 వాణిజ్య వివాదాలు కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. కెనడాతో అమెరికా చేప్టటిన చర్చలు పెద్దగా పురోగతి లేకుండా ముగిసినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికా, మెక్సికో, కెనడా 1994లో కుదుర్చుకున్న ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల(నాఫ్టా)ను ట్రంప్ ప్రభుత్వం వ్యతిరేకిస్తు న్న సంగతి తెలిసిందే. దీంతో నాఫ్టాను పూర్తిస్థాయి లో సవరించేందుకు సిద్ధమైన అమెరికా ప్రభుత్వం మెక్సికోతో సరికొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ కెనడాతో చర్చలు అంత ఫలవంతంకాలేదని తెలుస్తోంది. మరోవైపు 200బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై ఈ నెల 5నుంచి టారిఫ్‌ల అమలుకు ట్రంప్ ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. దీంతో వచ్చే వారం కూడా వాణిజ్య వివాదాలపై ప్రపంచ స్టాక్ మార్కెట్లు దృష్టిపెట్టనున్నాయి.

వాహనాల అమ్మకాలు
ఆగస్ట్ నెల వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఆటో రంగ కంపెనీలపై దృష్టి పెట్టాలి. జులై నెలకు 8కీలక పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం 6.6 శాతం వృద్ధిని సాధించింది. జూన్‌లో సాధించిన 7.6 శాతం పురోగతితో పోలి స్తే ఇది తక్కువే. తయారీ రం గంలో 40 శాతం వాటాను కలిగిన మౌలిక వృద్ది తొలి నాలుగు నెలల కాలంలో 5.8 శాతం పుంజుకుంది. ఆగస్ట్ 30 వరకూ చూస్తే నైరుతీ రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాలిక సగటుకంటే 6 శాతం తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. వీటితోపాటు విదేశీ ఇన్వెస్టర్లు, దేశీ ఫండ్స్ పెట్టుబడుల తీరు, ముడిచమురు ధర లు,రూపాయి కదలికలు వంటి అంశాలను ఇన్వెస్టర్లు గమనించాలని నిపుణులు పేర్కొంటున్నారు.