Search
Sunday 18 November 2018
  • :
  • :

కోలుకున్న మార్కెట్లు

sensexప్రోత్సాహం  36 పైసలు అప్
ముంబయి: సెన్సెక్స్ 20 నెలల పతనం నుంచి కోలుకొని 473 పాయింట్లు పెరిగి 24,435.66 పాయింట్లు చేరు కొంది. ఈ క్రమంలో యూరో జోన్ నుంచి, చమురు ధర లు పుంజుకొన్న పరిస్థితినుంచి తాజాగా ప్రోత్సాహాన్ని అందుకొని సెన్సెక్స్ లాభపడింది. ఫోరెక్స్ మార్కెట్‌లో రూ పాయి 29నెలల పతనం నుంచి కోలుకొని సెంటిమెంట్ ఆధారంగా 36 పైసలు పుంజుకొంది. డాలర్‌తో దాని విలువ 67.66 కు చేరింది. అయితే వారం ప్రాతిపదికపై బిఎస్‌ఇ సెన్సెక్స్‌మితంగా 19.38 పాయింట్లు (0.07 శా తం) పతనమైంది. విస్తృత ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ వరుసగా మూడోసారి 15.35 పాయింట్లు ( లేదా 0.2o శాతం) పతనమైంది. ప్రపంచ మార్కెట్లనుంచి పానుకూల సంకే తాలు అందాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ యూ రోజోన్ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికిమరింతగా ద్రవ్య సహాయానికి ముందుకు రావడంతో మార్కెట్లు పుంజుకొన్నాయి. అలాగే ముడి చమురు ధరలు 12 ఏళ్ల పతనం నుంచి కోలుకొని బ్యారెల్ 30 అమెరికా డాలర్ల పైగా ధరపలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ 1.52 పాయింట్లు లేదా 5.2 శాతం పెరిగి బ్యారెల్ 30.77 అమెరికా డాలర్లు అయింది. 30 షేర్ల సెన్సెక్స్ బలంగా 24,122.06 వద్ద మొదలైంది. 24,000 పా యింట్ల మార్కునుంచి బయటపడింది. అదే ధోరణిలో ముందుకు సాగి ఈ రోజు మొత్తంలో అత్యధికంగా 24, 472.88 పాయింట్లను తాకి 473.45పాయింట్లు లేదా 1.98 శాతం లాభపడి 24,435.66 వద్ద ముగిసింది. ఇది అక్టోబర్ 5 నుంచి అత్యధిక ఒక్కరోజు లాభం. ఇక ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 7400 పాయింట్లు తిరిగి కోలుకొని 7,433.40 పాయింట్లు లాభపడి తుదకు 7,422.45 వద్ద స్థిరపడింది.
గెయిల్‌కు లాభాల జోరు
బిఎస్‌ఇ లో గెయిల్ అత్యధికంగా 7.99 శాతం లాభపడింది. తరువాత స్థానంలో మారుతి సుజుకి 5.53 శాతం లాభపడింది. బాగా లాభపడిన ఇతర సంస్థలలో టాటా స్టీల్స్, హీరో మోటార్ కార్పోరేషన్, ఎం అండ్ ఎం, ఎస్‌బిఐ, కోల్ ఇండియా, డా. రెడ్డీస్ లాబ్స్, ఒఎన్‌జిసి,ఎన్‌టిపిసి, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టి, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఐ బ్యాంక్, బిహె చ్‌ఇఎల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, రిల్ సంస్థలు ఉన్నాయి. మొత్తం మీద ౩౦- స్క్రిప్ ఇండెక్స్‌లో 26 కౌంటర్లు లాభపడ్డాయి. ఈ రోజు మార్కెట్‌లో వెనుకబడ్డ కంపెనీలలో భారతి ఎయిర్ టెల్, హెచ్‌యుఎల్, విప్రో, ఇనోసిస్ కూడా ఉన్నాయి.
స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.25 శాతం, మిడ్ క్యాప్ 1.90 శాతం పుంజుకొన్నాయి. సెక్టార్ల వారీగా చూస్తే మెటల్ ఇండెక్స్ ఎక్కువగా (4.32 శాతం) లాభపడింది. తరువాత ఆటో (3.65 శాతం), పిఎస్‌యు (3.48 శాతం౦, ఇన్ఫ్రా (3.00 శాతం), ఆయిల్ అండ్ గ్యాస్ (2.95 శాతం), బ్యాంకింగ్ (2.81 శాతం), యంత్రపరికరాలు (2.66 శాతం). ఆరోగ్య సంరక్షణ రంగం (2.45 శాతం) పుంజుకొన్నాయి.
ప్రపంచ మార్కెట్లు ప్రోత్సాహకరం
ప్రపంచ వ్యాప్తంగా జపాన్‌కు చెందిన నిక్కీ 5.88 శాతంతో ర్యాలీ అయింది. షాంఘ్ఘై ఉమ్మడి ఇండెక్స్ 1.25 శాతం అధికంగా కోట్ చేసింది. హాంకాంగ్ హాంగ్ పెంగ్ ఇండెక్స్ 2.90 శాతం దూకుడు రికార్డు చేసింది. యూరోపియన్ షేర్లు కూడా ఆరంభంలో లాభాలు చవిచూశాయి.

Comments

comments