Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ముక్కుపై కళ్లద్దాల మచ్చలు పోవాలంటే..!

marksవయసుతో సంబంధం లేకుండా చాలా మంది కళ్లద్దాలు పెట్టుకో వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కళ్లద్దాలు పెట్టుకుంటే కంటి చూపు బాగుంటుంది. కానీ వాటి వల్ల కొంతమందికి ముక్కు మీద మచ్చలు పడే అవకాశం ఉంది. వారి కోసం కొన్ని చిట్కాలు.

* రోజూ పడుకునే ముందు రోజ్ వాటర్‌లో నిమ్మరసం కలిపి ముక్కపై రుద్ది 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఇలా చేయడం వలన మచ్చలు తగ్గుతాయి.
* ఆరెంజ్ తొక్కల పొడి, పాలు,పెరుగు, బంగాళాదుంప, టమాటా.. వీటిలో ఏదో ఒకటి తీసుకొని రోజ్ వాటర్ లోకి ఆ మచ్చలపై రాయాలి. ఇలా చేయడం వలన మచ్చలను తగ్గించుకోవచ్చు.
* అలాగే కళ్లద్దాలను రోజూ యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో కడగాలి. లేదంటే కళ్లద్దాలపై ఏర్పడే బ్యాక్టీరియా వల్ల కళ్లు ఎర్రగా అయిపోవడం, కంటి చుట్టూ చర్మం నల్లగా మారిపోవడం, మచ్చలు ఏర్పడటం జరుగుతుంది.
* అంతేకాకుండా రోజూ కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లను తప్పకుండా తాగాలి.
* కళ్లద్దాలతో ఎక్కువగా అవసరం లేనప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలి.

ఎంపిక ముందు
* లెన్స్ తక్కువ బరువు ఉన్న కళ్లద్దాలను ఎంపిక చేసుకోవాలి.
* అలాగే ఫ్రేము ఎంచుకునేటప్పుడు కూడా తేలికైనది తీసుకోవడం ఉత్తమం.
* కళ్లజోడు కొనే ముందు అది మీకు సరిగ్గా సరిపోయిందా? లేదా? అన్నది సరిచూసుకోవాలి. అది మరీ వదులుగా ఉండకూడదు. అలాగే మీరి బిగించినట్టు ఉండకూడదు. అప్పుడే ముక్కు మీద మచ్చలుపడకుండా ఉంటాయి.

Comments

comments