Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కన్నుల పండువగా మెహందీ వేడుక

bipasaబాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు, కరణ్‌సింగ్ గ్రోవర్‌ల మెహందీ ఫంక్షన్ శుక్రవారం రాత్రి ముంబయ్‌లోని విల్లా 69లో వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి ముందు రోజు ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మెహందీ వేడుకలో పెళ్లికూతురు బిపాసా… అందమైన పింక్ లెహెంగా, చోళీ ధరించి ఫ్లోరల్ జ్యూయలరీలో మెరిసింది. పెళ్లి కొడుకు కరణ్‌సింగ్ గ్రోవర్ వైట్ కలర్ అంగార్క కుర్తా పైజామాలో దర్శనమిచ్చాడు. ఈ వేడుకకు శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా, సోదరి షమితాశెట్టితో కలిసి హాజరైంది. బిపాసా,కరణ్‌ల స్నేహితులు, సన్నిహితులు మెహందీ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఇక ‘ఎలోన్’ సినిమా చేస్తున్న సమయంలో చిత్ర హీరోహీరోయిన్‌లు కరణ్, బిపాసాల మధ్య ఏర్పడ్డ సాన్నిహిత్యం చివరికి పెళ్లి వరకు వెళ్లింది.

Comments

comments