Home ఆంధ్రప్రదేశ్ వార్తలు పెళ్లి పందిట్లో…. ప్రేమిస్తున్నానని యువకుడి హల్‌చల్

పెళ్లి పందిట్లో…. ప్రేమిస్తున్నానని యువకుడి హల్‌చల్

bridegroom missing

 

అమరావతి: పెళ్లి కూతురిని ప్రేమిస్తున్నానని యువకుడు హంగామా చేయడంతో పెళ్లి ఆగిపోయిన సంఘటన కర్నూలు జిల్లా డోన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డోన్‌కు చెందిన అమ్మాయిని ఆస్ట్రేలియాలో స్టాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న యువకుడితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి జరుగుతుండగా సురేష్ అనే యువకుడు వచ్చి ఆ పెళ్లి కుమార్తెను ప్రేమిస్తున్నానని హల్‌చల్ చేశాడు. దీంతో పెళ్లి కుమార్తె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లి రద్దు చేసుకొని వరుడు బంధువులు వెళ్లిపోయారు. అతడు ఎవరో తనకు తెలియదని పెళ్లి కూతురు ఎంత చెప్పినా వరుడు కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Marriage Cancelled with Man in Kurnool in Andhra Pradesh