Home తాజా వార్తలు స్ట్రెచర్‌పైనే పెళ్లి

స్ట్రెచర్‌పైనే పెళ్లి

Marriageకర్నూలు: జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెళ్లి కుమారునికి స్ట్రెచర్‌పైనే వివాహం జరిపించారు. ఉమ్మాయిపల్లెకు చెందిన వరుడు లక్ష్మీనారాయణరెడ్డికి ఆళ్లగడ్డ మండలం పెద్ద కంబలూరుకు చెందిన లక్ష్మీతో వివాహం కుదిరింది. కొలిమిగుండ్లలోని షిర్డీసాయి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బంధువులతో కలిసి వరుడు కారులో బయలు దేరాడు. అయితే కారు తోళ్లమడుగు సమీపంలోకి రాగానే మలుపు వద్ద ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమారుడి కాలు విరగగా, ఇద్దరు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వరుడి కాలు విరగడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ పెళ్లిని వాయిదా వేయకుండా యథావిధిగా జరిపించాలని బంధువుల అభ్యర్థన మేరకు వరుడిని అంబులెన్స్‌లో పెళ్లి మండపానికి తీసుకుని వచ్చి పెళ్లి జరిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం వరుడిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.