Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మార్చి-ఏప్రిల్‌లో పెళ్లి?

loversఅక్కినేని వారింటి పెళ్లి సందడి నెలకొంది. నాగచైతన్య-సమంత, అఖిల్-శ్రేయా భూపాల్‌లకు వివాహాలు నిశ్చయం కావడమే కాదు ఇప్పటికే అఖిల్ నిశ్చితార్థం కూడా పూర్తయిపోయింది. ఇక జనవరి 29న చైతన్య-సమంతల ఎంగేజ్‌మెంట్ జరుగనుందనే వార్తలు కూడా వచ్చేశాయి. నిజ జీవితంలో హీరోహీరోయిన్‌లుగా మారుతున్న వీరిద్దరు ఇప్పుడు తమ పెళ్లి ప్రణాళికలో మార్పులు తీసుకొస్తున్నట్లు సమాచారం. నిజానికి వచ్చే ఏడాది జూన్ తర్వాత చైతన్య-సమంతల వివాహం జరుగుతుందన్నారు. కానీ ఇప్పుడు ఈ పెళ్లి ఇంకా ముందే జరుగనున్నట్లు తెలిసింది. చిన్నవాడైన అఖిల్ పెళ్లి మే నెలలో జరుగనుండగా… ఆతర్వాత పెద్దవాడైన చైతన్య పెళ్లి జరగడం సరికాదని పలువురు అక్కినేని కుటుంబానికి చెప్పారట. దీంతో అఖిల్-శ్రేయాలకంటే ముందే పెళ్లి చేసుకోవాలని చైతన్య-సమంతలకు అక్కినేని కుటుంబం చెప్పిడంతో దీనికి వారు కూడా అంగీకరించారని అంటున్నారు. జనవరిలో నిశ్చితార్థం జరుపుకొని మార్చి-ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలని చైతన్య-సమంతల నిర్ణయించుకున్నారని సమాచారం.

Comments

comments