Home హైదరాబాద్ అత్తింటి వేధింపులు… వివాహిత ఆత్మహత్య

అత్తింటి వేధింపులు… వివాహిత ఆత్మహత్య

Marriage suicide is the husband family harassment

మాదన్నపేట్‌: అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్.ఐ మాధవ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… తలాబ్‌కట్టకు చెందిన షేక్‌ఇమాం, బిపాషా బేగంల కూతురు కనీస్ ఫాతిమాకు మాదన్నపేట్ మౌలానా ఆజాద్‌నగర్‌కి చెందిన మహ్మద్ నసీర్‌ఖాన్‌తో 2016లో వివాహం జరిగింది. పిల్లలు కాకపోవడంతో పలుమార్లు వీరి మధ్య గొడువ జరిగింది. పెద్దలు జోక్యం చేసుకొని రాజీ కుదిర్చారు. మళ్లీ ఇదే విషమంపై గురువారం రాత్రి గొడవ కావడంతో మనస్తాపానికి గురై తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన్నట్టు తెలిపారు.