Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) మేడ్చల్ లో అదృశ్యమైన వివాహిత

మేడ్చల్ లో అదృశ్యమైన వివాహిత

Married disappeared in Medchal

మేడ్చల్: ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన మంగళవారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాయిమీది తాండ పెద్దేములు మండలానికి చెందిన రాథోడ్ పరుశరాం తన భార్య మహదేవీ(22), ఇద్దరు పిల్లలతో కలిసి జీవనోపాధి నిమిత్తం మేడ్చల్ మండలంలోని సాలెగూడెంకు వలస వచ్చారు. పరుశరాం పనిమీద ఊరికి వెళ్లగా ఉదయం 11:30 గంటలకు తమ గుడిసె ప్రక్కన ఉన్న ఓ వ్యక్తి వద్ద పోన్ తీసుకొని ఎవరితోనే మాట్లాడినట్టు తెలిపారు. మధ్యాహ్నాం పిల్లలను గుడిసెలో పడుకోబెట్టి మహదేవీ ఎక్కడికో వెళ్లిపోయింది. పిల్లలు ఏడుస్తుండటంతో పొరుగు వారు పిల్లలను ఓదార్చారు. సాయంత్రం ఆరు గంటలకు పరుశరాం ఇంటికి రాగా ప్రక్కన ఉన్న వారు తన భార్య ఎక్కడికో వెళ్లిందని తెలిపారు. దీంతో పరుశరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.