Search
Sunday 18 November 2018
  • :
  • :

బోయిన్‌పల్లిలో వివాహిత ఆత్మహత్యాయత్నం!

Married Woman attempt suicide in Bowenpally

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో నడిరోడ్డుపై ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది.అందరూ చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. భవిత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్థానికులు మంటలను ఆరిపివేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పొరుగింటిలో ఉండే పోకిరి వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments