Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

వివాహిత ఆత్మహత్య

Married Woman Commits Suicide in Jangaon District

జనగామ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే కొండ అలేఖ్య(29) అనే మహిళ కుటుంబ గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో ఉండగానే ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, భర్త ఇంట్లో ఉండగానే అలేఖ్య ఆత్మహత్య చేసుకోవడం పట్ల  స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments