Home తాజా వార్తలు కిరోసిన్ పోసుకొని వివాహిత ఆత్మహత్య

కిరోసిన్ పోసుకొని వివాహిత ఆత్మహత్య

Married Woman Commits Suicide In Peddapalli District

ధర్మారం: మండలం  కేంద్రంలోని నంది మేడారంలో ఓ వివాహిత శనివారం సాయంత్రం కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం, మేడారంకు చుందిన రాచూరిశ్రీలత (25)ను జూలపల్లి మండలం, బాలరాజ్‌పల్లికి చెందిన పెరిక సంపత్‌కు ఇచ్చి ఆరు సంవత్సరాల కితం వివాహం జరిపించారు. శ్రీలతకు మూడు సంవత్సరాల రిషి భరద్వాజ్ కుమార్‌తో పాటు రెండు నెలల బాబు ఉన్నాడు గత ఐదు మాసాల క్రితం రెండో బాబు పురుడు కోసం బాలరాజ్‌పల్లి నుండి మేడారం వచ్చిన శ్రీలత ఇక్కడే ఉంటుంది. శనివారం నాడు మధ్యాహ్నం తల్లిని పని మీద బయటికి పంపించి, పుట్టింటిలోని బాత్‌రూమ్‌లో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. పూర్తిగా కాలిన గాయాలతో శ్రీలత అక్కడికక్కడే మృతి చెందింది.

కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి ధర్మారం ఎస్‌ఐ కె. ప్రేమ్ కుమార్‌కు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా శ్రీలత గత కొద్ది రోజులు నుండి మానసిక సమస్యలతో బాధపడుతుందని, ఆ దిశలోనే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా ఈ మృతి చెందిన శ్రీలతకు నాలుగు సంవత్సరాల బాబుతో పాటు, ఇంకా నామకరణం చేయని రెండు నెలల చిన్నారి బాబు ఉన్నాడు. ఇద్దరు చిన్నారి పిల్లలు తల్లి ఆకస్మిక మృతితో అనాధలుగా మారారు. చిన్నారులను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు. ఈ సంఘటన మేడారంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ధర్మారం ఎస్‌ఐ కె. ప్రేమ్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

శ్రీలత మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థాలాన్ని తహశీల్దార్ టి. సంపత్ డిప్యూటీ తహశీల్దార్ కె. శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ విషయంపై ఎస్‌ఐ కె. ప్రేమ్ కుమార్ మన తెలంగాణ తో మాట్లాడుతూ తమకు ఫిర్యాదు అందిందని విచారణ చేస్తున్నామని తెలిపారు.

Married Woman Commits Suicide In Peddapalli District