Search
Sunday 23 September 2018
  • :
  • :

పదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. చివరికి…

Married Woman Commits Suicide: Prakasam district
అమరావతి: పదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ, దంపతుల మధ్య ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో శనివారం రాత్రి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఏలూరుకు చెందిన చింతలపూడి సింధూజ (28), ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివా‌స్ ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం తణుకు వచ్చేశారు. ప్రస్తుతం పైడిపర్రులో శ్రీనివాసులు ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా సింధూజ, శ్రీనివాస్‌ను బంగారు ఆభరణాల కోసం ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సింధూజ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments