Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నడిరోడ్డుపై వివాహిత దారుణ హత్య

Murder-Attemptఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దుండగుడి దౌర్జన్యానికి మరో మహిళ బలైంది. కొద్ది రోజుల క్రితమే ఓ యువకుడు తన ప్రేమను అంగీకరించలేదని యువతిని నడిరోడ్డుపై దారుణంగా పొడిచి చంపిన విషయం మరిచిపోకముందే.. అలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎంజి రోడ్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మహిళను కత్తితో పొడిచి హతమార్చాడు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… పింకీ దేవి(34) అనే వివాహితను గత కొంతకాలంగా జితేందర్ అనే ఆటో డ్రైవర్ వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం ఎంజి రోడ్డు స్టేషన్ వద్ద నడుస్తున్న ఆమెను జితేందర్ వెంబడించడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన పింకీ విషయాన్ని భర్త మాన్‌సింగ్‌కు పోన్ చేసి చెప్పాలనుకుంది. ఫోన్ చేసి మాట్లాడుతుండగా.. జితేందర్ ఆమెను సమీపించి కత్తితో పలుమార్ల పొడిచాడు. సమాచారం అందుకున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది వెంటనే నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ ఆమె మార్గ మధ్యంలోనే మరణించింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments