Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

SUICIDE1గణపురం : ఆచార్య జయశంకర్ జిల్లా గణపురంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం గణపురానికి చెందిన పల్లె మల్లయ్య, త్రివేణి(35)లకు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. మల్లయ్య కొద్దిరోజులుగా ఏ పని చేయకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన త్రివేణి బుధవారం ఇద్దరు కుమార్తెలు అక్షయ(15), శ్రీజ(12)తో కలసి చెరువులో దూకింది. గ్రామస్థుల సమాచారంతో ఎస్సై ప్రవీణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని తహసీల్దారు దివాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మృతదేహాలను వెలికితీశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments