Home తాజా వార్తలు అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Married-Women

రంగారెడ్డి: వివాహిత భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తపూర్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గృహిణి నడుము స్వల్పంగా దెబ్బతింది. రెండు కాళ్లూ పూర్తిగా విరిగిపోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఐదు సంవత్సరాల క్రితం నీలం అగర్వాల్, శశి అగర్వాల్ కు పెళ్లి జరిగింది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు 13 లక్షల కట్నం ఇచ్చారు. గత సంవత్సరం నుంచి అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించారు. దీంతో వాళ్ల వేధింపులు భరించలేక శుక్రవారం ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు ఆమె అత్త విజయలక్ష్మి, భర్త శశిని అరెస్టు చేశారు.