Home సూర్యాపేట వరకట్న వేధింపులకు నవ వధువు బలి

వరకట్న వేధింపులకు నవ వధువు బలి

Married Women Dies With Husband Harrasments

కోదాడక్రైమ్‌ః  నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన పసుపులేటి వినోద్ భార్య పసుపులేటి విజయ (19) అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కోదాడ డిఎస్పి సుదర్శన్‌రెడ్డి మరియు మునగాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివరామ్‌గౌడ్ ఇరువురు తెలిపిన వివరాల ప్రకారం… హుజూర్‌నగర్ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కడియం వెంకటేశ్వర్లు, ఎల్లమ్మ దంపతుల రెండవ కూమార్తె అయిన విజయ గత 45 రోజుల క్రితం రత్నవరం గ్రామానికి చెందిన పసుపులేటి వినోద్‌తో వివాహాం జరిగిందని వారు తెలిపారు. విజయ తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్నిరోజులుగా మా కూతురును వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారని చరవాణిలో తెలపగా ,మా కూతురికి మేము సర్దిచెప్పుకుంటు వస్తున్నాము. కానీ శనివారం మా కూతురుని ఆసుపత్రికి తీసుకు వచ్చిన సంగతి మాకు చెప్పకుండా చని పోయిన గంట తరువాత మీ కుతూరు మృతి చెందిందని తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరరకు నడిగూడెం ఎస్‌ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.