Search
Friday 16 November 2018
  • :
  • :

పాముకాటుకు మహిళ మృతి

Snake Bite

సిరికొండ: సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామ పరిధిలోని ఒడ్డెర కాలనీకి చెందిన ఎల్లమ్మ అనే వివాహిత సోమవారం రాత్రి పాముకాటుకు గురై మరణించి నట్టు కాలనీ వాసులు తెలిపారు. భోజనం చేసి పడుకునే సమయంలో పాము కాటుకు గురైనట్టు వారు తెలిపారు. పాముకాటకు గురైన ఎల్లమ్మను వెంటనే నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికిని ఫలితం లేకుండా పోయిందని అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారని వారు అన్నారు. ఎల్లమ్మ కు భర్త, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉంది.

Comments

comments