Search
Thursday 15 November 2018
  • :
  • :

వివాహిత అదృశ్యం

Married Women Missing In Medchal District

మేడ్చల్ : వివాహిత అదృశ్యమైన సంఘటన శుక్రవారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలో నివాసముండే సత్యపాల్‌కు 2009లో కోర్పతి పల్లవి(26)తో వివాహం జరిగింది. కాగా ఈ నెల 16వ తేదీన తన భర్తతో గొడవ జరగడంతో పుట్టింటికి వెళ్లింది. తిరిగి 18వ తేదీన తిరిగి అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత పల్లవి తండ్రి పంతంగి బాబు పల్లవికి ఫోన్ చేయగా పని చేస్తున్నట్లు చెప్పింది. ఈ నెల 21వ తేదీన ఫోన్ చేయగా పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాబు మేడ్చల్‌కు వచ్చి అల్లుడు సత్యపాల్‌ను అడుగగా తన స్కూటి పైన రెండు లగేజి బ్యాగులను తీసుకొని ఈ నెల 18వ తేదీన కొంపల్లికి వెళ్తున్నాని చెప్పి వెళ్లిందని చెప్పారు. దీంతో తెలిసిన చోట వెతికినా ఆచూకి లభించలేదని తెలిపారు. కాగా పల్లవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పల్లవి తండ్రి పంతంగి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేశ్ తెలిపారు.

Comments

comments