Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

యజమానితో పారిపోయిన వివాహిత మృతి

More than Half of the Victims of Personal Murders Worldwide are Women

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానితో పారిపోయిన వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన స్వామి దంపతులు కొంత కాలంగా హైదరాబాద్ లోని షేక్ పేట సమీపంలో నివసిస్తున్నారు. స్వామి ఆటో నడుపుతుండగా ఆయన భార్య ఓ హోటల్ లో క్లీనింగ్ సెక్షన్ లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.  పదిహేను రోజుల క్రితం తన భార్య అదృశ్యమైందని షేక్ పేట పోలీస్ స్టేషన్ లో స్వామి ఫిర్యాదు చేశాడు. భార్య ఎంత వెతికినా ఆమె అచూకీ లభించకపోవడంతో తన కుమారుడిని తీసుకొని స్వస్థలానికి వెళ్లిపోయాడు. హోటల్ యజమాని శేషు, వివాహిత లెనిన్ నగర్ లో ఉంటున్నారు. లెనిన్ నగర్ లో  స్వామి భార్య అనుమానస్పద స్థితిలో మృతి చెందందని స్థానిక సిఐ యాదయ్య తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Married Women Murdered in Rangareddy

Telangana news

Comments

comments