Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

young Man Sucide Attempted In Sangaredy Districtమన తెలంగాణ/జనగామ క్రైం : భర్త వేధింపులు తాళలేక భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడిన సంఘటన జనగామ పట్టణంలోని సూర్యాపేట జాతీయ రహదారి ప్రక్కన మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల తల్లిదండ్రుల కథనం ప్రకారం జనగామ జిల్లా  పెంబర్తి గ్రామానికి చెందిన అచ్చిని రాజు  గత 9 సంవత్సరాల క్రితం యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన స్వప్నను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు, సంధ్య రెండో తరగతి, రాహులు ఒకటవ తరగతి చదువుతున్నారు. పెళ్లి సమయంలో రాజుకు కట్నంగా రూ.3 లక్షల రూపాయలు 5 తులాల బంగారం ఇచ్చి పెళ్ళి చేశామని తెలిపారు. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు రావడంతో అదనంగా కట్నం తీసుకురావాలని రాజు స్వప్నను వేధించడంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి మరో లక్ష రూపాయలు రాజు ఇవ్వడం జరిగిందని తెలిపారు. భర్త రాజు ఏ పనిలేకుండా జలసాలకు అలవాటు పడి బంగారం డబ్బును కూడ ఖర్చుచేసి అప్పులపాలయ్యాడని, దీంతో తన కూతుర్ని పిల్లలను చేరదీయకుండా ఉండడంవల్ల పెంబర్తి గ్రామ పెద్దలకు తమ గోడును వినిపించామని అయినా రాజు మారకపోవడంతో అత్తమామ కోడలు పిల్లలు హైదరాబాద్‌కు తమ ఆడబిడ్డ వద్దకు వెళ్లి కూలీ పనిచేసూకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో పిల్లలకు స్కూల్లు తెరవడంతో హైదరాబాద్ నుంచి పెంబర్తికి రావడం జరిగిందని అన్నారు. అయినా కూడ రాజులో మార్పు రాకపోవడంతో పిల్లలను  భార్యను పట్టించుకోకపోవడంతో స్వప్న మనస్తాపానికి గురై మంగళవారం  తన ఇద్దరు పిల్లలతో సహా తాను కూల్ డ్రింక్‌లో కలిపిన  పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్సకోసం వరంగల్ ఎంజిఎంకు తరలించారు. సంఘటన స్థలానికి  జనగామ ఎసిపి వి. బాపురెడ్డి, జనగామ సిఐ ముసికె శ్రీనివాస్, ఎస్‌ఐ వహీద్ వెళ్ళి పరిశీలించారు. ఈ సంఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments