Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

శర్వానంద్‌తో మారుతి చిత్రం

maruthiఒక సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే వరకు ఆ సినిమా ఖాయం అనుకోలేని పరిస్థితి నేడు ఉంది. ముందుగా అనుకున్న కాంబినేషన్‌లలో కొన్ని సాధ్యపడితే… ఆతర్వాత మరికొన్ని కొత్త కాంబినేషన్‌లు తెరపైకి వస్తాయి. దర్శకుడు మారుతి విషయంలో ఈమధ్యన అలాగే జరుగుతోంది . ఇప్పుడు మారుతి కొత్త సినిమా యంగ్ హీరో శర్వానంద్‌తో ఉంటుందని తాజా సమాచారం. ‘బాబు బంగారం’ తర్వాత ఒకేసారి రెండు సినిమాలకు స్క్రిప్ట్‌వర్క్ మొదలుపెట్టాడు మారుతి. అందులో ఒకటి హవీష్ సినిమా కోసమైతే… ఇంకో సినిమాకు హీరో అనుకోలేదు. ఈ రెండో సినిమాకు హీరోగా శర్వానంద్‌ను ఎంచుకున్నాడట మారుతి. ప్రస్తుతం శర్వానంద్… దిల్‌రాజు ప్రొడక్షన్‌లో ‘శతమానం భవతి’ సినిమా చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది ఆఖరుకు పూర్తవుతుంది. మరోవైపు చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా కూడా పూర్తికావచ్చింది. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తాడట శర్వానంద్. యంగ్ టాలెంటెడ్ హీరో నానికి ‘భలే భలే మగాడివోయ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌నిచ్చిన మారుతి… శర్వాకు ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాల్సిందే.

Comments

comments