Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మారుతి సింపుల్‌గా కథ రాస్తాడు

Maruthi

మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తున్న చిత్రం ‘బ్రాండ్ బాబు’. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ, మురళీశర్మ ప్రధాన తారాగణంగా నటించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ “నేను తొలిసారి పూర్తిగా మాటలు, స్క్రిప్ట్ అందించిన సినిమా ఇది. ఈ సినిమాను అందరూ ప్రేమించి చేశారు”అని అన్నారు. హరీశ్ శంకర్ మాట్లాడుతూ “మారుతి చాలా సింపుల్‌గా కథ రాస్తాడు. ప్రభాకర్ ‘నెక్స్ నువ్వే’ సినిమాతో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలి”అని తెలిపారు. దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ “మారుతి సక్సెస్ అయిన తొలి రోజు నుండి కొత్త వారికి అవకాశం ఇస్తూ వస్తున్నారు. జెబి అద్భుతమైన పాటలను ఇచ్చాడు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమంత్ శైలేంద్ర, ఎస్.శైలేంద్ర బాబు, పూజిత వన్నోడ, ఇషా రెబ్బా, రాజా రవీంద్ర, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments