Home తాజా వార్తలు కార్ల ధరలను పెంచిన మారుతి

కార్ల ధరలను పెంచిన మారుతి

maruti hikes car prices of to Rs 6100

న్యూఢిల్లీ: మారుతి సుజుకి తన కార్ల ధరలను పెంచింది. అన్ని మోడల్స్‌పై ఆ రేట్లు వర్తిస్తాయని సంస్థ తాజాగా వెల్లడించింది. ప్రతి మోడల్‌పై సుమారు రూ.6,100 వరకు పెంచినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, విదేశీ ఎక్స్‌చేంజ్ రేట్లు పెరగడం వల్ల  కార్ల ధరలను పెంచినట్టు మారుతి సంస్థ స్పష్టం చేసింది. ఆగస్టు 16వ తేదీ నుంచి పెంచిన ధరలు  అమలులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.