Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కార్ల ధరలను పెంచిన మారుతి

Maruti raised car prices

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచింది. వివిధ మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు గురువారం దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం, పంపిణీ వ్యయం పెరగడం, విదేశీ మారక రేట్ల ప్రతికూలతలు ధరల పెంపునకు కారణమయ్యాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. మారుతికి చెందిన అన్ని మోడళ్ల వాహనాల ధరలను గరిష్టంగా 6,100 రూపాయల (ఎక్స్ షోరూం ఢిల్లీ) వరకు ధరల పెంచుతున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. బాగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, తదితర వ్యయాల కారణంగా తమ వాహనాల ధరలను ఆగస్టు నుంచి పెంచుతున్నట్టు మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, టాటా మోటార్స్‌లాంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.

Comments

comments