Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

నంబర్ 1 మారుతి ‘డిజైర్’

 Maruti Suzuki has acquired six models in the Top 10

జూలై సేల్స్‌లో టాప్ 10 కార్లలో ఆరు మారుతీవే.. 

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ టాప్ 10లో ఆరు మోడళ్లను సొంతం చేసుకుంది. జూలై నెలకు గాను అత్యధికంగా విక్రయం అయ్యే పది ప్యాసింజర్ కార్లలో మొదటి స్థానంలో డిజైర్ నిలిచింది. మిగతా ఐదు స్థానాలు కూడా మారుతీ కార్లే ఉన్నాయి. మారుతీకి చెందిన డిజైర్ జూలైలో 25,647 యూనిట్లను సేల్ చేసింది. ఆ తర్వాత రెండో స్థానంలో హాచ్‌బ్యాక్ ఆల్టో 23,371 యూనిట్లను విక్రయించగా, మూడో స్థానంలో హాచ్‌బ్యాంక్ స్విఫ్ట్ 19,993 యూనిట్లు సేల్ చేసింది. కంపెనీ ప్రీమియం కాంపాక్ట్ హాచ్‌బ్యాక్ బాలెనో నాలుగో స్థానం దక్కించుకోగా, ఈ కార్లు దాదాపు 17,960 యూనిట్లు సేల్ అయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో బాలెనో టాప్ 10లో రెండో స్థానంలో నిలిచి.. దాదాపు 19,153 యూనిట్లు సేల్ చేసింది. మారుతీ వాగనర్ మోడల్ ఐదో స్థానంలో ఉంది. ఈ మోడల్ గత నెలలో 14,339 యూనిట్లు సేల్ చేయగా, గతేడాది ఇదే నెలలో ఈ కారు విక్రయించిన యూనిట్లు 16,301 కావడం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయమేమికంటే మారుతీ సుజుకీ సంస్థకు చెందిన విటారా బ్రెజ్జా హుందాయ్ క్రెటాను అధిగమించింది. ఈసారి విటారా బ్రెజ్జా ఆరో స్థానాన్ని దక్కించుకుంది. బ్రెజ్జా జూలైలో 14,181 యూనిట్లను విక్రయించింది. ఆ తర్వాత  ఏడో స్థానంలో ఎలైట్ ఐ20 కారు 10,822 యూనిట్లను విక్రయించగా, గ్రాండ్ ఐ10 10,775 యూనిట్లతో 8వ స్థానాన్ని దక్కించుకుంది. ఇత హుందయ్ క్రెటా 10423 యూనిట్లను సేల్ చేసి తొమ్మిదో స్థానాన్ని సరిపెట్టుకోగా, హోండా అమేజ్ 10,180 యూనిట్లను విక్రయించి పదో స్థానంలో నిలిచింది.

Comments

comments