Home తాజా వార్తలు భారీ డిస్కౌంట్లు ప్రకటించిన మారుతి…

భారీ డిస్కౌంట్లు ప్రకటించిన మారుతి…

Maruti Suzuki Ciazముంబయి: భారత్ లో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న అతిపెద్ద సంస్థ మారుతి సుజుకి. ఈ కంపెనీ వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ను తాజాగా ప్రకటించింది. తమ ప్రధాన డీలర్‌ షిప్‌ నెక్సా ద్వారా అమ్మకాలు జరుపుతున్న కార్లకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని పేర్కొంది. సంస్థ ఎంపిక చేసిన పలు రకాల మోడళ్లపై రూ. 60 వేల వరకూ తగ్గింపు కస్టమర్లకు లభించనుంది. ఇవి ఏప్రిల్ నెలకు మాత్రమే పరిమితమని, సియాజ్‌, బాలెనో, ఎస్‌-క్రాస్‌, ఇగ్నిస్‌ మోడళ్లను తక్కువ ధరకు పొందవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
దీంతో పాటు ఎర్టిగా ఫేస్‌ లిఫ్ట్‌ పై రూ. 33 వేలు, ఎస్‌-క్రాస్‌ పై ఏకంగా రూ. 55 వేల డిస్కౌంట్‌ ను పొందవచ్చని మారుతి తెలిపింది. ఇండియాలో మారుతి సుజుకి సంస్థకి చెందిన కార్లు వినియోగదారులు ఎక్కువగా కోనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ కార్లు మెంటేనెస్స్ సౌకర్యం సులువుగా ఉండటం ప్రధాన కారణం. అందుకే కస్టమర్లు ఈ సంస్థకు చెందిన కార్లపై ఆసక్తి చూపటం విశేషం.
Maruti Suzuki Nexa offers discounts upto 65000