Home దునియా ఐరన్ లేడీ..

ఐరన్ లేడీ..

Mary Kom

ఇప్పుడంతా మేరీ కోమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. లైట్ వెయిట్ విభాగంలో మేరీకోమ్ ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను ఓడించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏకపక్ష పోటీలో 35 ఏళ్ల మేరీ కోమ్ తనకన్నా 12 ఏళ్లు చిన్నదైన హనాను ఓడించింది. ఆమె చివరిసారిగా 2010 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలో స్వర్ణపతకం సాధించింది. అంతకు ముందు 2002, 2005, 2006, 2008లో స్వర్ణపతక విజేతగా నిలిచింది. తాజా విజయంతో మేరీ కోమ్, గతంలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఐదుసార్లు స్వర్ణపతకం సాధించిన ఐర్లాండ్‌కు చెందిన కేటీ టైలర్ రికార్డును తిరగరాసింది. అదే సమయంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఆరుసార్లు స్వర్ణపతకం సాధించిన పురుష బాక్సర్ ఫెలిక్స్ సెవన్ రికార్డును సమం చేసింది.

మణిపూర్‌లోని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన మేరీ బాక్సింగ్ నేర్చుకోవడం ఎవరికీ ఇష్టంలేదు. దీంతో ఆమె పొలంలో పని చేస్తూ, ఇంటి పనులు చేసుకుంటూ, తోడబుట్టిన వాళ్లను చూసుకుంటూనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేది. చాలాకాలం వరకు ఆమె బాక్సింగ్ నేర్చుకుంటోందని ఇంట్లో తెలీనే తెలీదు. 2000లో రాష్ట్ర ఛాంపియన్‌షిప్ పోటీల ఫొటోలు పత్రికల్లో ప్రచురితం కావడంతో ఇంట్లో బాక్సింగ్ గురించి తెలిసింది.అయితే బాక్సింగ్‌లో దెబ్బలు తగిలితే ఆమెకు పెళ్లి కాదని తండ్రి భయపడేవాడు. కానీ తండ్రి భయాన్ని ఆమె లెక్కచేయలేదు. గీత ఏడాది నవంబర్‌లో ఆమె ఐదోసారి ఆసియన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఐదోసారి స్వర్ణపతకం సాధించింది.

MC Mary Kom

ప్రియాంక చోప్రా కథానాయికగా మేరీ కోమ్ పేరుతో తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈమెను ఐరన్ లేడీ అని కూడా పిలుస్తారు. బాక్సింగ్ రింగ్‌లోనే కాదు, నిజజీవితంలోనూ ఆమె సమస్యలతో పోరాటం చేసింది కనుకనే ఐరన్ లేడీ అని కూడా పిలుస్తుంటారు మేరీని. 2011లో ఆమె మూడున్నర ఏళ్ల కుమారుడికి గుండె ఆపరేషన్ జరిగింది. అదే సమయంలో ఆమె ఆసియా కప్ కోసం చైనా వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఏం చేయాలో తోచనప్పుడు ఆమెకు భర్త అండగా నిలిచాడు. కొడుకును భర్త సంరక్షణలో వదిలి ఆమె ఆసియా కప్‌కు వెళ్లి, స్వర్ణపతకం సాధించి తిరిగి వచ్చారు.

 

Mary Kom Information in Telugu

Telangana news