Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

స్వర్ణ భారతం

పదో రోజు 8 స్వర్ణాలు, మేరీకోమ్, బాత్రా, రాజ్‌పుత్, నీరజ్, వికాస్‌లకు
పసిడి పతకాలు, కొనసాగుతున్న భారత్ జోరు

గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో పదో రోజు భారత్ జోరు కొనసాగించింది. పదో రోజు భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఏకంగా 8 పసిడి పతకాలు గెలుచుకొని ప్రకంపనలు సృష్టించింది. బాక్సింగ్, షూటింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, టిటిలలో భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కాయి. మరోవైపు బ్యాడ్మింటన్‌లో మరో స్వర్ణం ఖాయమైంది. పదో రోజు పోటీలు ముగిసే సమయానికి భారత్ 25 స్వర్ణాలు, 16 రజతాలు, మరో 18 కాంస్యాలతో సహా 59 పతకాలు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం పోటీలకు చివరి రోజు కావడంతో భారత్‌కు మూడో స్థానం ఖాయమైనట్టే. మహిళల బాక్సింగ్‌లో మేరీకోమ్, రెజ్లింగ్‌లో వినేష్ ఫొగట్, టిటిలో మనిక బాత్రా స్వర్ణాలు గెలిచి సత్తా చాటారు. బాక్సింగ్‌లో వికాస్ కృష్ణన్, గౌరవ్ సోలంకిలకు పసిడి పతకాలు లభించాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. షూటింగ్‌లో సంజీవ్ రాజ్‌పుత్‌కు, రెజ్లింగ్‌లో సుమిత్ మాలిక్‌లకు స్వర్ణాలు లభించాయి. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌కు చేరుకున్నాడు. స్కాష్‌లో దీపిక పల్లికల్ జంటకు రజతం లభించింది. టిటి డబుల్స్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. సిక్కిరెడ్డిఅశ్విని పొన్నప్ప జోడీకి కాంస్యం లభించింది. బాక్సింగ్‌లో మనీష్ కౌశిక్, అమిత్ పంగల్‌లకు రజతాలు దక్కాయి. కాగా, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డిచిరాగ్ శెట్టి జంట ఫైనల్‌కు చేరుకుంది. ఇదిలావుండగా హాకీలో భారత్‌కు నిరాశే మిగిలింది. పురుషులు, మహిళల విభాగంలో భారత జట్లు కనీసం కాంస్య పతకం కూడా గెలుచుకోలేక పోయాయి. పురుషుల జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. మహిళా జట్టు కూడా ఇంగ్లాండ్ చేతిలోనే పరాజయం చవిచూసింది. మహిళల 62 కిలోల రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కాంస్యం తో సరిపెట్టుకుంది.

మేరీకోమ్ పంచ్ అదిరింది

mary

మహిళల బాక్సింగ్‌లో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన మహిళల 4548 కిలోల ఫైనల్లో మేరీకోమ్ అసాధారణ పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరిం నార్త్ ఐర్లాండ్ బాక్సర్ క్రిస్టియానా వోరాతో జరిగిన పోరులో మేరీకోమ్ 50 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణం సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో ఓ భారత మహిళ బాక్సర్ పసిడి పతకం గెలవడం ఇదే ప్రథమం. కోట్లాది మంది అభిమానుల అంచనాలను నిలబెడుతూ భారత స్టార్ మేరీకోమ్ స్వర్ణం సాధించింది. ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా కామన్వెల్త్‌లో పసిడి నెగ్గడం ద్వారా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.
నీరజ్ సంచలనం

sts
పురుషుల జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా పసిడి పతకం గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన పోటీల్లో నీరజ్ స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో జావెలిన్‌త్రోలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం గమనార్హం. ప్రారంభం నుంచే నిలకడైన ప్రదర్శన కనబరిచిన నీరజ్ 86.47 మీటర్లతో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. 20 ఏళ్ల నీరజ్ ఇటీవల కాలంలో అసాధారణ ఆటతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తాజాగా కామన్వెల్త్‌లో స్వర్ణం గెలవడం ద్వారా తన సత్తా ప్రపంచానికి చాటాడు.
వికాస్ పసిడి పంచ్

sptrs
పురుషుల బాక్సింగ్‌లో భారత స్టార్ బాక్సర్ వికాస్ కృష్ణన్ స్వర్ణం సాదించాడు. 75 కిలో ల విభాగంలో బరిలోకి దిగిన వికాస్ తనదైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ప్రారంభం నుంచే అదిరే పంచ్‌లతో ప్రత్యర్థిని హడలెత్తించిన వికాస్ సునాయాసంగా విజయం సాధించాడు. కామెరూన్ బాక్సర్ సెయితో శనివారం జరిగిన ఫైనల్లో వికాస్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ భారత్‌కు పసిడి పతకం అందించాడు. ఫైనల్లో వికాస్ 50తో జయకేతనం ఎగుర వేశాడు. మరో బాక్సర్ గౌరవ్ సోలంకి కూడా పసిడి పతకం గెలుచుకున్నాడు. 52 కిలోల విభాగంలో గౌరవ్‌కు స్వర్ణం లభించింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన గౌరవ్ ఫైనల్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. చివరి వరకు ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఇదిలావుండగా అమిత్ పంగల్, మనీష్ కౌశిక్‌లకు రజతాలు లభించాయి. శనివారం జరిగిన 49 కిలోల విభాగం ఫైనల్లో అమిత్ ఓటమి పాలయ్యాడు. 60 కిలోల విభాగం ఫైనల్లో మనీష్‌కు ఓటమి తప్పలేదు. దీంతో ఇద్దరు రజతాలతో సరిపెట్టుకున్నారు.
రాజ్‌పుత్‌కు స్వర్ణం

spt
షూటింగ్‌లో భారత్ స్వర్ణాల వేట శనివారం కూడా కొనసాగింది. పదో రోజు పురుషుల షూటింగ్‌లో సంజీవ్ రాజ్‌పుత్ పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగం పోటీల్లో రాజ్‌పుత్‌కు స్వర్ణం లభించింది. ప్రారంభం నుంచే పూర్తి ఏకాగ్రత కనబరిచిన రాజ్‌పుత్ తన ఖాతాలో స్వర్ణం జమ చేసుకున్నాడు.
చరిత్ర సృష్టించిన మనిక బాత్రా

మహిళల టిటిలో మనిక బాత్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన మహిళల టిటి సింగిల్స్ ఫైనల్లో మనిక విజయం సాధించింది. సింగపూర్ క్రీడాకారిణితో జరిగిన ఫైనల్లో మనిక 117, 116, 112, 117తో జయకేతనం ఎగురవేసి స్వర్ణం సొంతం చేసుకుంది. కామన్వెల్త్ మహిళల టిటి సింగిల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం కావడం విశేషం. కాగా, ఈ క్రీడల్లో మనికకు ఇది మూడో పతకం. ఇంతకుముందు మిక్స్‌డ్ టీమ్‌లో కూడా మనిక సభ్యురాలు. మిక్సడ్ టీమ్ విభాగంలో భారత్‌కు పసిడి లభించిన విషయం తెలిసిందే. కాగా, మహిళల టిటి డబుల్స్‌లో మనిక రజతం సాధించింది.

సింధు x సైనా పసిడి పోరు

saina
బ్యాడ్మింటన్‌లో భారత స్టార్లు సైనా నెహ్వాల్, పివి.సింధులు స్వర్ణ పోరుకు చేరుకున్నారు. మహిళల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజాలు సింధు, సైనాలు ఫైనల్లో ప్రవేశించారు. దీంతో స్వర్ణం కోసం ఇద్దరు తలపడనున్నారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఇద్దరు స్వర్ణం కోసం పోటీ పడతారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో శ్రీకాంత్ 2110, 1821, 2117తో ఇంగ్లాండ్ క్రీడాకారుడిపై విజయం సాధించాడు. కాగా, మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోసింధు 2118, 218తో కెనడా క్రీడాకారిణిపై జయభేరి మోగించింది. సైనా సెమీస్‌లో స్కాట్లాండ్ క్రీడాకారిణి క్రిస్టి గిల్‌మెర్‌పై విజయం సాధించింది. మూడు సెట్ల సమరంలో సైనా 2114, 1821, 2117తో గెలుపొందింది. పురుషలు డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ చిరాగ్ జంట 2118, 2110తో శ్రీలంక జంటపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు స్కాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపిక పల్లికల్ జంట ఫైనల్లో ఓటమి పాలై రజతంతో సరి పెట్టుకుంది. బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డిఅశ్విని పొన్నప్ప జంటకు కాంస్యం లభించింది.

వినేష్‌కు స్వర్ణం

sprts

మహిళల రెజ్లింగ్‌లో స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల 50 మీటర్ల విభాగంలో బరిలోకి దిగిన వినేష్ అసాధారణ ఆటతో ప్రత్యర్థిని మట్టి కరిపించింది. ప్రారంభం నుంచే తనదైన శైలీలో పట్టు బిగించిన వినేష్ ఏదశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. చివరి వరకు పట్టును నిలబెట్టుకుంటూ స్వర్ణం సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల 125 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం పోటీలో స్టార్ రెజ్లర్ సుమిత్ మాలిక్ పసిడి పతకం గెలుచుకున్నాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన సుమిత్ తన ఖాతాలో స్వర్ణం జమ చేసుకున్నాడు. ఇంతకుముందు సుశీల్ కుమార్, అవారెలు కూడా రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కాంస్యంతో సరిపెట్టుకోక తప్పలేదు. 62 కిలోల విభాగంలో బరిలోకి దిగిన సాక్షికి సెమీ స్‌లోనే చుక్కెదురైంది.

Comments

comments