Home అంతర్జాతీయ వార్తలు రాజకీయాల్లోకి క్రికెటర్

రాజకీయాల్లోకి క్రికెటర్

Mashrafe Mortaza to Stand in Election

ఢాకా : బంగ్లాదేశ్ క్రికెటర్ మష్రఫే మోర్తాజా రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. డిసెంబరు 30న బంగ్లా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయాల్లో రావాలని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా మష్రఫేను కోరారు. బంగ్లాలో మష్రఫేకు రాక్‌స్టార్‌గా పేరున్న విషయం తెలిసిందే. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరపున మష్రఫే పోటీ చేయనున్నట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. క్రికెటర్లు రాజకీయాల్లోకి వెళ్లడాన్ని క్రికెట్ బోర్డు వ్యతిరేకించదని బంగ్లా క్రికెట్ సంఘం స్పష్టం చేసింది. ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్‌పి పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అవినీతి ఆరోపణలతో ఖలిదా జియా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

Mashrafe Mortaza to Stand in Election