Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

చూచిరాతలు!

ఐటిఐ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
 ప్రేక్షకపాత్రలో అధికారులు

              SSC Exam Started Today in Telangana

ఖమ్మంవిద్యావిభాగం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్వహించిన ఐటిఐ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరిగినట్టు తెలుస్తోంది. వారంరోజులుగా ఐటిఐ పరీక్షలకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షల్లో అడుగడుగునా మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్టు సమాచారం. అయినప్పటికీ ఆయా కేంద్రాల వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం సందేహాలు కలిగిస్తోంది. గురువారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని సారథీ నగర్‌లోని ఓ ఐటిఐ కాలేజీలో మాస్ కాపీయింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు చూచిరాతలు రాసినా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేఅధికారులు ఆ కేంద్రాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో విమర్శలకు తావిస్తుంది.

ఐటిఐ విద్యార్థుల నుంచి ఆయా యాజమాన్యాలు ముందస్తుగా డబ్బులు వసూలు చేసి సంబంధిత శాఖాధికారులకు ముట్టజెప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఐటిఐ యాజమాన్యంతోపాటు కళాశాలలో పనిచేస్తున్న ఇతర అధికారులు సైతం ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఈ పరీక్షలు తమ కనుసన్నల్లో జరిగే చూసుకున్నారు. గురువారం ఉదయం 9.30 నుంచి 1.30 వరకూ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ పరీక్షకు గానూ మొత్తం 230 మంది హాజరు కావాల్సి ఉండగా 99 మంది గైర్హాజరయ్యారు. ఇదిలాఉంటే.. ఐటిఐ పరీక్షలపై సమగ్ర విచారణ జరపాల్సిన అసవరం ఎంతైనా ఉంది.

Comments

comments