Home తాజా వార్తలు మనసున్న మహారాజు మర్రి

మనసున్న మహారాజు మర్రి

Mass-marriages

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రజల మన్న నలు, గౌరవం, దీవెనలు పొంది మనసున్న మహారాజుగా మర్రి జనార్ధన్‌రెడ్డి పేరొందాడని రాష్ట్ర భారీ నీటిపారు దల శాఖా మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజా సేవయే పరమావధిగా భావించి వారి దీవెనలు పొందగల్గిన వారే నిజమైన ధనవంతులని హిందూ, ముస్లీం, క్రిస్టియన్‌ల సర్వతమ సమ్మేళనం వివాహాలు జరిపించిన ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్ రెడ్డి నిజమైన ధనవంతుడు, అభినందనీ యుడు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఎం జెఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కళ్యాణోత్సవానికి రాష్ట్ర మం త్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భం గా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ గత మూడేళ్లుగా పేదలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తున్న మర్రి జనార్ధన్ రెడ్డి సేవా భావం ఆదర్శం, ఆచరణీయం అన్నా రు. ప్రతి ఒక్కరు ఇది స్పూర్తితో చేతనైంత మేర పేద, బడు గు, బలహీన వర్గాలకు తమ వంతు సహాకారం అందించా లని సూచించారు. పేదరికమే ప్రాతిపదికగా ముఖ్యమం త్రి ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకాన్ని సామూహిక వేది క వివాహ జంటలకు వర్తించేలా చూస్తానని హామి ఇచ్చా రు. కెసిఆర్ కిట్ పథకం ఈ కొత్త జంటలకు ఉపయుక్తం గా ఉంటుందని కూడా మంత్రి హరీష్ రావు చలోక్తి విసి రారు. యాదాద్రి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం నిర్వహిం చేందుకు వచ్చిన త్రిదండి రామానుజ జీయర్ స్వామి మంగళ శాసనాలు చేస్తూ, జీవితంలో విశిష్టమైన గ్రహాస్తా శ్రమ ధర్మం పెండ్లితోనే ప్రారంభం అవుతుందని అలాంటి శుభకరమైన కళ్యాణోత్సవాలు 300 పైగా ఉచితంగా జరిపించిన మర్రి జనార్ధన్ రెడ్డి జన్మ చరితార్థమని దీవించారు.

Mass-Marriages-2

వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్‌లో నాగర్‌కర్నూల్‌లో శ్రీ మహాలక్ష్మి యాగం మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సామూహిక ఉచిత కళ్యాణాల కర్త నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇంత మందికి ఉచి తంగా సామూహిక వివాహాలు చేస్తున్న ఈ రోజు తన జీవితంలో శుభదినంగా భావిస్తున్నానన్నారు. తాను వేసే ప్రతి అడుగులు, వివాహాలే గాక ఇతర ప్రజా సేవా కార్యక్రమాల్లో కష్టాలు ఎన్ని ఎదురైనా ముందుకు సాగుతాయని అయితే ఇందుకు ప్రజల ఆశీస్సులు కావాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఏటా పేదలకు ఉచితంగా సామూహిక వివాహాలు చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి వరసగా మూడవ సంవత్సరం పెండ్లిలు చేసానని ఇక ముందు ఎంజెఆర్ ట్రస్టు ఆధ్వ ర్యంలో విద్య, వైద్యంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. తాను చేసే దార్మిక కార్యక్రమాల్లో తనకు చేదొడు వాదొడుగా ఉన్న తన శ్రీమతి మర్రి జమున, సోదరుడి సహకారనికి ఈ సందర్భంగా ఆయన ధన్య వాదాఆలు తెలిపారు. సా మూహిక ఉచిత వివాహాల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణా రా వు,లకా్ష్మరెడ్డి,ఎంపి జితేంధర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మె ల్యేలు ఆలా వెంకటేశ్వర్‌రెడ్డి, ఏనుగు రవిందర్, శ్రీనివాస్ గౌడ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బి.శివ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.