Home కుమ్రం భీం ఆసిఫాబాద్ గిరిజన జంటలకు సామూహిక వివాహాలు

గిరిజన జంటలకు సామూహిక వివాహాలు

 weddings *పేద ప్రజలకు అండగా ఉంటాం : మంత్రి జోగు రామన్న

మన తెలంగాణ/బెజ్జూర్ : పేద ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. బెజ్జూర్ మండలంలోని సోమిని ప్రాణహిత నది ఒడ్డున్న మంగళవారం సమ్మక్క సారక్క గద్దెల వద్ద 58 జంటలకు సామూహిక వివాహాలు మంత్రి జోగురామన్న , సిర్పూర్ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. సమ్మక్క సారక్క జాతరలో ఆదివాసి గిరిజన జంటలకు ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో పెళ్లిల్లు చేయడం గర్వకారణమన్నారు. ఆదివాసీ కుల సంఘాలకు అన్ని రకాల సేవలు అందిస్తామని ఆయన అన్నారు. ఇంట్లో ఒక పెళ్లి చేయడం ఈ కాలంలో ఎంతో కష్టంతో కూడుకున్నదని, 58 జంటలకు సాంప్రదాయకరంగా మంగళ సూత్రాలు, మట్టెలు, నిత్యావసర వస్తువులు, పుట్టింటి వారు ఇచ్చేసామాగ్రి అన్ని రకాల వస్తువులు అందించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా సిర్పూర్ ఎంఎల్‌ఎ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజలకు వేసవిలో అంబలి పంపిణీ, చలికాలంలో విద్యార్థులకు రగ్గులు, ఇంగ్లీష్ సులువుగా చేర్చుకోవడానికి ఇంగ్లీష్ పుస్తకాలు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు, గ్రామాలకు రోడ్ల సౌకర్యం, సిర్పూర్ నియోజకవర్గంలో చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప మాట్లాడుతూ గతంలో కూడా సామూహిక వివాహాలు సమ్మక్క సారక్క జాతర వద్ద చేశామని, అలాగే ఈ సంవత్సరం కూడా 58 జంటలకు తన చేతుల మీదుగా చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పెళ్లి చేసుకున్న జంటలకు మంత్రి జోగురామన్న రూ.1.16 లక్షల బహుమతి, ఐటిడిఏ చైర్మన్ కనాకె లక్కెరావు రూ. 21వేలు బహుమతి అందించినట్లు వారు పేర్కొన్నారు. మరిన్ని జంటలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. త్వరలో కాగజ్‌నగర్‌లో 116 జంటలకు సామూహిక వివాహాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా జరిపించనున్నట్లు వారు పేర్కొన్నారు.

పెళ్లిలు చేసుకున్న జంటలకు కళ్యాణలక్ష్మి పథకం కింద డబ్బులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. అందుకు ముందు సమ్మక్క సారక్క గద్దెల వద్ద మొక్కులు తీర్చుకున్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్నట్లు ఎంఎల్‌ఎ కోనప్ప తెలిపారు. ఎంఎల్‌ఎ కోనప్ప సతీమణి రమాదేవి దంపతులు కన్యాదాన పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ చైర్మన్ కనాకె లక్కెరావు, రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపిపి సిరిపురం మంజుల సదాశివ్, జడ్పిటిసి శారద జగ్గాగౌడ్, కౌటాల జడ్పిటిసి డుబ్బుల నానయ్య, రైతు సమన్వయ మండల కోఆర్డినేటర్ హర్షద్‌హుస్సేన్, సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, కోనేరు ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ, నాయకులు సకారాం, మనోహర్‌గౌడ్, కోర్తె తిరుపతి, ఓంప్రకాష్, కొప్పుల శంకర్, ఎస్‌ఆర్‌పిలు భిక్షమయ్య, వెంకటేశం,తెలంగాణ జాగృతి అధికారి ప్రతినిధి నరేందర్‌గౌడ్, తాలూకా పీఆర్‌ఓ కనుకుట్ల వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.